SALAAR-KGF: పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF, KGF2 తర్వాత భారీ అంచనాలతో రిలీజవుతోన్న మూవీ ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ఇద్దరు స్నేహితులతో ట్రైలర్ మొదలైంది. స్నేహితుడి కోసం ఏమైనా చేసే దేవా క్యారెక్టర్లో ప్రభాస్ కనిపించాడు. ‘‘నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా.. నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా అంటూ తన స్నేహితుడిపై ఉండే ఇష్టాన్ని స్ట్రాంగ్‌గా చూపించాడు. ప్రభాస్ స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్. అయితే చిన్నప్పుడే ఇద్దరు స్నేహితులు విడిపోతారు.
RGV VYOOHAM: ఆర్జీవీకి సినిమా కష్టాలు.. వ్యూహం రివర్స్.. వాళ్ల విషయంలో వర్మ ఫెయిల్ అయ్యాడా..
ఆ తర్వాత ఆపదలో ఉన్న పృథ్వీరాజ్.. కోసం ఒక సైన్యంలా తిరిగి వస్తాడు ప్రభాస్. ఈ సందర్భంగా ఇచ్చిన ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉంది. థియేటర్లో కూడా ప్రభాస్ ఎంట్రీ ఇక్కడే ఉంటుందేమో.. ఈ సీన్‌కి విజిల్సే విజిల్స్. వెయ్యేళ్ల కిందట ఈ కథ మొదలైంది. మహ్మద్ ఘజినీ, చెంగీస్ ఖాన్‌ల కన్నా క్రూరమైన బందిపోట్లు ఉండేవారు. ఈ బందిపోట్లు కొన్ని వందల సంవత్సరాలు ఎదురు లేకుండా ఎదిగారు. ఖాన్సార్ అనే అడవిని ఒక కోటగా మార్చుకున్నారు. ఆ ఖాన్సార్ ఒక సామ్రాజ్యమైంది. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి అంటూ జగపతి బాబు, పృథ్వీరాజ్ క్యారెక్టర్లను పరిచయం చేశారు. ‘‘నేనుండగా నా కొడుకు వరదరాజ్ మన్నార్‌ను దొరగా చూడాలనేది నా కోరిక అని జగపతి బాబు డైలాగ్ చెప్పిన వెంటనే పృథ్వీరాజ్ ఎంట్రీ ఇస్తాడు. రాజ మన్నార్‌గా నటించిన జగపతి బాబు.. వరద రాజ్‌కు ఆ సామ్రాజ్య బాధ్యతలు అప్పగించి వెళ్లిపోతాడు. దీంతో రాజమన్నార్ తిరిగి వచ్చే లోపు వరద రాజ్‌ను నాశనం చేయాలనే శత్రువులు కుట్ర పన్నుతారు. అల్లర్లు సృష్టిస్తారు.
Etcherla Politics: ఎచ్చెర్లలో ఏం నడుస్తోంది.. ఎచ్చెర్లలో ఉప్పు, నిప్పు ఒక్కటయ్యాయా?
ఆ సమయంలో సైన్యంలా ఎంట్రీ ఇస్తాడు ప్రభాస్. వరద రాజుపై దాడి కోసం.. శత్రువులు నరాంగ్, గురంగ్‌లు రష్యా, సెర్పిబియన్ ఆర్మీతో ఖాన్సార్ సామ్రాజ్యాన్ని చుట్టుముడతారు. దీంతో వరద రాజు కూడా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు సైన్యం బదులు దేవా పేరుని చెబుతాడు వరద. అప్పుడు ఎంట్రీ ఇచ్చే ప్రభాస్ ‘‘పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి. బయటకు ఎవడు పోతాడని కాదు. లోపలికి ఎవడొస్తాడా అని’’ అనే డైలాగ్‌తో ఎలివేషన్ సాగింది. ఫ్రెండ్‌ను ముట్టుకోకూడదనే రిక్వెస్ట్‌తో ట్రైలర్ ముగిసింది. KGF తో లింక్ లేదని ప్రశాంత్ నీల్ చెప్పాడు కానీ.. ఈశ్వరీ రావు క్యారెక్టర్ చూస్తుంటే మాత్రం అలా అనిపించడం లేదు. చిన్నప్పుడే ప్రభాస్ తల్లితో ఖాన్సార్ నుంచి వెళ్లిపోయి KGFలో చిక్కుకుని ఉంటాడని అక్కడ నుంచి విముక్తి పొందిన తర్వాత.. ప్రభాస్ ‘సలార్’గా ఎంట్రీ ఇస్తాడని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. దాదాపు 3 నిమిషాల 47 సెకండ్ల రన్ టైం తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
సలార్ పార్ట్ 1 లో స్నేహితులుగా కనిపించిన ప్రభాస్-పృథ్వీరాజ్ సుకుమారన్.. పార్ట్ 2లో శత్రువులుగా మారనున్నారని టాక్. KGF కోసం ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టించినట్లుగానే సలార్ కోసం ఖాన్సార్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే ఈసారి థియేటర్స్‌లో ప్రభాస్ వన్ మ్యాన్ షో తో థియేటర్స్ దద్దరిండడం ఖాయం.