Salaar: మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ సలార్ సంచలనాలకు సిద్ధమవుతోంది. కిస్మస్ రేస్‌లో షారూఖ్ డంకీని ఢీ కొడుతూ కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు థియేటర్లలోకి వస్తోంది. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత మళ్లీ ప్రభాస్‌కి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చే చిత్రమిదని చర్చ సాగుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలనం సృష్టించిన గ్రేట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈసారి ప్రభాస్‌ని మ్యాసివ్ యాక్షన్ స్టార్‌గా చూపించబోతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యాక్షన్ ప్యాక్డ్ మూవీ రిలీజ్‌కి నెలన్నర మాత్రమే మిగిలి ఉండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Salaar: మాస్ ర్యాంపేజ్‌కి గెట్ రెడీ.. సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇంకా థియేటర్లలోకి రాక ముందే దిమ్మతిరిగే రేంజ్‌లో బిజినెస్ జరిగినట్లు టాక్ నడుస్తుండగా.. బాలీవుడ్ తన అసూయను బయటపెట్టింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సలార్ మూవీ.. వీఎఫ్ ఎక్స్ వర్క్ వల్ల వాయిదా పడ్డ బిజినెస్ మాత్రం నెక్ట్స్ లెవల్ అనేలా జరుగుతోంది. తెలుగులో కళ్లు బైర్లు కమ్మేలా.. దాదాపు రూ.175 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అంతేకాక ఓవర్సీస్‌లో కూడా ఫ్యాన్సీ నెంబర్‌కు అమ్ముడుపోయినట్లు టాక్. సౌత్‌లో ఇప్పుడిప్పుడే బిజినెస్ డీల్ జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా కేరళలో అదిరిపోయే రేంజ్‌లో హక్కులను సొంతం చేసుకున్నాడు సలార్ విలన్ పృథ్వీరాజ్. సౌత్‌లో సలార్ మేనియా కొనసాగుతుండగా.. హిందీలో మాత్రం సీన్ రివర్స్ అవ్వడంతో పాటు బాలీవుడ్ మీడియా తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ను డైనోసార్‌గా పోలుస్తూ ప్రశాంత్ ఇచ్చిన హైప్‌కు ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఫిదా అవుతున్నారు.
అంతేకాక ఈ మూవీ వాయిదా పడుతున్నా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తగ్గడం లేదు. పైగా మరింత హైప్ క్రియేట్ అవ్వడంతో బాలీవుడ్ మీడియా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సలార్ హిందీ డీల్ క్యాన్సిల్ అయినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హిందీ హక్కులను ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొన్ని నెలల కిందటే తీసుకుంది. అయితే ఇప్పుడా సంస్దవాళ్లు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ వాయిదా పడటం.. క్రిస్మస్ సీజన్లో డంకీతో పోటీ పడాల్సి రావడంతో ఈ డీల్‌పై ఆలోచనలో పడినట్లు టాక్ వినిపిస్తోంది. మారుతున్న పరిస్థితుల్లో ఈ డీల్ ఓకే చేయడం రిస్క్ అని ఆ సంస్థ వెనక్కి తగ్గిందని.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా హిందీ రైట్స్‌పై గందరగోళం పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.