SALAAR: సలార్ మూవీ ఏక్షణాన డిసెంబర్22 అని ప్లాన్ చేశారో కాని, రెబల్ స్టార్ మూవీ మీద దాడి పెరగటం మొదలైంది. దసరా రిలీజ్‌కి ఛాన్స్ లేదు. దీపావళికి సల్మాన్ సినిమా ఉందని నార్త్ ఆడియన్స్ అనటంతో, ఫిల్మ్ టీం క్రిస్మస్‌ని చూసుకుంది. పోటీగా షారుఖ్ మూవీ డంకీ ఉన్నా కానీ సలార్ మేకర్స్ రిస్క్ చేశారు. ఇంతా చేస్తే సీన్ రివర్స్ అయ్యేలా ఉంది.
హాలీవుడ్ మూవీ సీన్ లోకి వచ్చింది. దాడి కన్పామ్ అయ్యింది. ఆక్వామెన్ సీక్వెల్‌గా తెరకెక్కిన ఆక్వామెన్ 2 రానుంది. ఫస్ట్ పార్ట్ అప్పట్లో మన మార్కెట్లోనే రూ. 250 కోట్లు రాబట్టింది. అంత క్రేజ్ ఉన్న మూవీకి సీక్వెల్ అంటే ఈ సారి ఆక్వామెన్ సందడి భారీగా ఉండేలా ఉంది. డిసెంబర్ 22 సలార్ రిలీజ్ అయ్యే రోజు. కాని ఒకరోజు ముందు డంకీ రానుంది. దానికంటే ముందు ఆక్వామెన్ 2 రానుంది. ఒక్కో రోజు గ్యాప్‌తో తో మూడు మూవీలు. దీంతో ఎక్కువ నష్టపోయేది సలార్ సినిమానే. ముందు ఏ మూవీ వస్తే ఆ సినిమాకు ఎక్కువ థియేటర్స్ దొరికి ఓపెనింగ్స్ వస్తాయి. అలా చూస్తే సలార్ కంటే ముందు డంకీ, ఆక్వామెన్ 2 రానున్నాయి.
కాబట్టి ఆ మూవీలకే బెనిఫిట్ ఉంటుంది. ఇవి ఎక్కువ థియేటర్స్ ని లాగేసుకుంటే, సలార్‌కి నార్త్ లో థియేటర్ల పంపకాల్లో నష్టాలు కష్టాలు తప్పేలాలేవు. ఇక డంకీ నార్త్ లో సలార్ కి పంచ్ ఇస్తే ఆక్వామెన్ నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా సలార్ కి థియేటర్స్ పరంగా హిందీ, ఇంగ్లీష్ మూవీలతో ఇబ్బందులు తప్పేలా లేవు.