Salaar: రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ ఆరోజే..

ఈ వీకెండ్‌కు సలార్ సాంగ్‌ని రిలీజ్ చేయాలనే మూవీ టీం ఫిక్స్ అయ్యింది. సండే రోజు సలార్ సాంగ్‌ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. శుక్రవారం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 05:40 PM IST

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ నటిస్తున్న సలార్ ట్రైలర్ రాబోతోంది. రిలీజ్ డేట్‌కి మూడు ముహుర్తాలను మూవీ టీం ఫిక్స్ చేసింది. మ్యాగ్జిమమ్ ఆగస్ట్ 15.. అంటే ఇండిపెండెన్స్ డే రోజే ఈ మూవీ ట్రైలర్ వచ్చే అవకాశాలే ఎక్కువ. కాని గ్రాఫిక్స్ వర్క్‌కు 8 రోజులు టై పడుతోందట. కేవలం ట్రైలర్ కోసమే టీం ఆల్రెడీ పనిచేస్తోంది. ఒక వేళ ఆగస్టు 15కి ట్రైలర్ రెడీ అయ్యే ఛాన్స్ లేదంటే ఆగస్ట్ 18కి, లేదంటే ఆగస్ట్ 25కి రిలీజ్ చేస్తారట. అది కూడా ఆగస్ట్ 8న ఎనౌన్స్ చేయబోతున్నారట.

ఇది ఇప్పటి వరకు అందిన సమాచారం. ఐతే ఈ వీకెండ్‌కు సలార్ సాంగ్‌ని రిలీజ్ చేయాలనే మూవీ టీం ఫిక్స్ అయ్యింది. సండే రోజు సలార్ సాంగ్‌ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. శుక్రవారం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తోంది. మొత్తానికి ఒక పాట, అలానే ట్రైలర్ రెండింటినీ రిలీజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ ఈ మూవీ ప్రమోషన్‌ని పీక్స్ తీసుకెళ్లే పనిలోఉన్నాడు. ఫ్యాన్స్‌కి కూడా ఈనెలలో రెండు గిఫ్ట్‌లని రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. మరోపక్క ట్రైలర్‌కి డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి.