SALAAR: సలార్‌ కథను మలుపు తిప్పిన ఈ అమ్మాయి గురించి మీకు తెలుసా

సలార్‌ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పిన అమ్మాయి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కాటేరమ్మ ఫైట్‌ సీక్వెన్స్‌ వేరే లెవెల్‌.

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 07:15 PM IST

SALAAR: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఎలివేషన్స్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన సలార్‌ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కోసం ఎప్పటి నుంచో వెయిట్‌ చేస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫుల్‌ మీల్స్‌ లాంటిది. ప్రస్తుతం థియేటర్ల దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ చేస్తోంది సలార్‌ సినిమా.

Ponguleti Srinivasa Reddy: ఆరు గ్యారెంటీల అమలు.. 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

ఇదిలా ఉంటే.. సలార్‌ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పిన అమ్మాయి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కాటేరమ్మ ఫైట్‌ సీక్వెన్స్‌ వేరే లెవెల్‌. ఈ సీన్‌లో దేవతను ప్రార్థించే చిన్నారి తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆ అమ్మాయి పేరు ఫర్జానా సయ్యద్‌. సలార్ సినిమాలో ఈ అమ్మాయి చేసిన పాత్రతో మూవీ స్టోరీ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమాలో డీ గ్లామరస్‌గా కనిపించినా.. బయట మాత్రం ఫర్జానా చాలా అందంగా ఉంది.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఫర్జానా.. చాలా కమర్షియల్‌ యాడ్స్‌లో కనిపించింది. సలార్‌ ఆడిషన్స్‌ జరుగుతున్న సంగతి తెలిసి ఆ ఆడిషన్స్‌కు వెళ్లిందట ఫర్జానా. అక్కడ ఫర్జానా టాలెంట్‌ చూసిన ప్రశాంత్‌ నీల్‌ మొదటి రౌండ్‌లోనే ఆమెను సెలెక్ట్‌ చేశాడట. సినిమాలో తనకు ఏదో చిన్న రోల్‌ ఇస్తారని అనుకుందట ఫర్జానా. కానీ కథనే మలుపుతిప్పే రోల్‌లో కనిపించడం.. అది కూడా ప్రభాస్‌తో సీన్‌ ఉండటంతో షాకయ్యిందట. సలార్‌ సినిమాలో నటించడం తన జీవితంలో ఓ అచీవ్‌మెంట్‌గా చెప్తోంది ఫర్జానా.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఫర్జానా ఫొటోలు, ఆమె చేసిన యాడ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. డీగ్లామరస్‌గా అమ్మాయిని చూసి ఇప్పుడు గ్లామరస్‌గా చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. సినిమాలో ఉంది ఈ అమ్మాయేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా చిన్న వయసులోనే పాన్‌ఇండియా సినిమాలో చాన్స్‌ దక్కించుకుకి మంచి క్రేజ్‌ సంపాదించుకుంది ఫర్జానా సయ్యద్‌.