SALAAR: సలార్ వెయ్యికోట్ల కలకి బ్రేక్ వేస్తున్న కొత్త సినిమాలు

సలార్‌కి డంకీ మూవీ ఇప్పుడు కొత్తగా షాక్ ఇస్తోంది. డంకీ ఫ్లాప్ అన్నారు. కానీ, నిదానంగా వందా, రెండొందలు, మూడొందలంటూ 450 కోట్లు రాబట్టింది. రోజు రోజుకి దీని వసూళ్లు నార్త్‌లో పెరుగుతున్నాయి. సలార్ వసూళ్లు మెల్లిగా 30, 20, 18 కోట్లంటూ డ్రాప్ అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 05:34 PM IST

SALAAR: సలార్ మూవీ 700 కోట్ల క్లబ్‌లో చేరింది. మరో వారం, పదిరోజులు సీన్ ఇలానే కంటిన్యూ అయితే చాలు.. వెయ్యికోట్ల వసూళ్లకి ఛాన్స్ ఉంది. ఇక ఫైటర్ మూవీతో హ్రితిక్ నార్త్ మార్కెట్ మీద దండెత్తేందుకు ఈనెల 25న వస్తున్నాడు. అంతవరకు అక్కడ థియేటర్స్‌లో సలార్ సందడే కాబట్టి వసూళ్ల వరదకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. కాని కథ అడ్డం తిరుగుతోంది. సలార్‌కి డంకీ మూవీ ఇప్పుడు కొత్తగా షాక్ ఇస్తోంది. డంకీ ఫ్లాప్ అన్నారు. కానీ, నిదానంగా వందా, రెండొందలు, మూడొందలంటూ 450 కోట్లు రాబట్టింది.

Yatra 2 Teaser: ఇచ్చిపడేశారుగా.. తండ్రి పోయాడు అనుకుంటే.. కొడుకు వచ్చాడు..!

రోజు రోజుకి దీని వసూళ్లు నార్త్‌లో పెరుగుతున్నాయి. సలార్ వసూళ్లు మెల్లిగా 30, 20, 18 కోట్లంటూ డ్రాప్ అవుతున్నాయి. దీనికితోడు యూఎస్‌లో ఇప్పటి వరకు ఈమూవీ 9 మిలియన్లు అంటే 72 కోట్లే రాబట్టింది. మరో మిలియన్ వస్తే 80 కోట్ల సీన్ వచ్చినట్టౌతుంది. ఏమాత్రం అంచనాల్లేని రాకీ రాణీ ఔర్ ఏక్ ప్రేమ్ కథ యూఎస్‌లో పది మిలియన్లు రాబట్టింది. అలాంటిది ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా ఏరేంజ్‌లో అక్కడ వసూళ్లు రాబట్టాలి..? కానీ మరో మిలియన్ మించి సలార్ రాబట్టేలా లేదు. మొత్తంగా పదిన్నర మిలియన్లు అంటే, సుమారు 85 కోట్లు వసూళ్ల వద్దే సలార్ యూఎస్ వసూళ్లు నిలిచిపోయేలా ఉన్నాయట. ఇది సలార్ వెయ్యికోట్ల వసూళ్ల కలకి బ్రేక్ వేయకపోవచ్చు. కానీ, ఆ పనిలో సౌత్ సినిమాలు రెడీగా ఉన్నాయి. వచ్చే వారం గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ మూవీలు రాబోతున్నాయి. కాబట్టి టెలుగు రాష్ట్రాల్లో సలార్ వసూళ్లకి గండి పడొచ్చు.

హనుమాన్ మూవీ వల్ల హిందీ మార్కెట్‌లో సలార్ దూకకుడికి బ్రేక్ పడుతుంది. 1200 థియేటర్స్ వరకు నార్త్‌లో హనుమాన్ రాబోతోంది. తమిళనాడులో కెప్టెన్ మిల్లర్, అయలాన్ మూవీలు వస్తుండటంతో సౌత్ మొత్తాన్ని ఈ సినిమాలే ఆక్రమించబోతున్నాయి. కాబట్టి.. యూఎస్‌లో డంకీ మూవీ జోరు పెరగటంతో అక్కడ సలార్ వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తే సలార్ వెయ్యికోట్ల కల నెరవేరేలా లేదు.