SALAAR: బాలీవుడ్ బలుపు తగ్గించిన సలార్.. లాస్ట్ పంచ్ మనదే..

కేవలం 3 రోజుల్లో సలార్ మూవీకి 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే మతిపోవాల్సిందే. అదే జరిగింది. అదే షారుక్ డంకీ మూవీ చూస్తే రూ.137 కోట్ల వసూళ్లు సాధించాయి.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 04:53 PM IST

SALAAR: చిరు వాల్తేర్ వీరయ్య, బాలయ్య భగవంత్ కేసరి, నాని దసరా, హాయ్ నాన్న ఇలా ఓ మూడు నాలుగు సినిమాలు వదిలేస్తే.. ఈఏడాది పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు సినిమా వెలగలేదు. అదే టైంలో పటాన్, జవాన్, యానిమల్ అంటూ బాలీవుడ్ దూసుకెళ్లింది. మళ్లీ వాళ్లకు కొమ్ములొచ్చాయనేలా.. వాళ్ల కామెంట్ల ఓవరాక్షన్ కూడా కనిపించింది.

Pooja Hegde: ఆఫర్లు నిల్.. అయినా తగ్గని పూజా హెగ్డే..

కట్ చేస్తే ఒక్కడు.. సలార్ అంటూ వచ్చాడు. వాయించేస్తున్నాడు. కేవలం 3 రోజుల్లో సలార్ మూవీకి 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే మతిపోవాల్సిందే. అదే జరిగింది. అదే షారుక్ డంకీ మూవీ చూస్తే రూ.137 కోట్ల వసూళ్లు సాధించాయి. అది కూడా ఓవర్‌సీస్ నుంచే ఎక్కువగా వచ్చాయి. నార్త్ బెల్ట్‌లో అంత కలెక్షన్లు లేవు. సలార్ దెబ్బకి బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలకు వాస్తవం బోధపడినట్టుంది. అదేంటో.. ఇంతవరకు బాహుబలి, త్రిబుల్ ఆర్, కేజీయఫ్, కాంటారా, పుష్ప.. ఇలా తెలుగు, కన్నడ సినిమాలకు నార్త్‌లో జనం ఎగబడినట్టు, హిందీ సినిమాలకోసం సౌత్ జనం ఎగబడట్లేదు. దంగల్, జవాన్ ఏదో సౌత్‌లో కూడా ఆడాయి. కానీ, పూనకాలొచ్చేంత సీన్ క్రియేట్ చేయలేకపోయాయి.

ఏదో పటాన్, జవాన్ వెయ్యి కోట్లు రాబట్టాయని అనుకోవటమే తప్ప.. సౌత్‌లో ఆ సినిమాల సీన్ ఎంతంటే ఆన్సర్ లేదు. కాని తెలుగు, కన్నడ సినిమా దర్శకులు మాత్రం నార్త్ ఆడియన్స్ పల్స్ పట్టేశారు. సలార్ నార్త్ ఇండియా దండయాత్రతో అది మళ్లీ ప్రూవ్ అయ్యింది. ఇలా ఎలా చేయాలో తెలియక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఏదేమైనా ఈ ఏడాది తెలుగు వెలుగులు లేవని సంతోషపడ్డ బాలీవుడ్‌కి, సలార్ చాచి పెట్టి పంచ్ ఇచ్చింది.