SALAAR: చిన్న సినిమాలను టెన్షన్ పెడుతున్న సలార్..

క్రిస్మస్‌ సినిమాలు కొత్త రిలీజ్‌ డేట్స్‌పై మల్లగుల్లాలు పడి ఒక్కొక్కటీ రిలీజ్‌ డేట్‌తో బైటకొస్తున్నాయి. సలార్‌కు ఒక వారం ముందు వస్తే ఆ వారం తర్వాత కలెక్షన్స్‌ ఏమీ వుండవు. సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినా.. సలార్‌ గాలిలో కొట్టుకుపోతుందన్న భయం లేకపోలేదు.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 08:03 PM IST

SALAAR: సలార్‌ రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌మెంట్‌ చిన్న సినిమాలన్నింటినీ ఇబ్బంది పెట్టింది. డిసెంబర్‌ 22న సలార్‌ వస్తుంటే.. క్రిస్మస్‌‌కు రావాల్సిన నాని నటించిన హాయ్‌ నాన్న.. వెంకటేశ్‌ నటిస్తున్న సైంథవ్‌.. నితిన్‌ నటిస్తున్న ఎక్స్‌స్ట్రా వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఎక్స్‌స్ట్రా.. సైంథవ్‌ రిలీజ్‌ డేట్స్‌ ఎనౌన్స్‌ చేసినా.. హాయ్‌ నాన్న విడుదల తేదీని ఇంకా ఎందుకు ప్రకటించలేదు? క్రిస్మస్‌ సినిమాలు కొత్త రిలీజ్‌ డేట్స్‌పై మల్లగుల్లాలు పడి ఒక్కొక్కటీ రిలీజ్‌ డేట్‌తో బైటకొస్తున్నాయి.

సలార్‌కు ఒక వారం ముందు వస్తే ఆ వారం తర్వాత కలెక్షన్స్‌ ఏమీ వుండవు. సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినా.. సలార్‌ గాలిలో కొట్టుకుపోతుందన్న భయం లేకపోలేదు. అందుకే నితిన్‌ ఎక్స్‌స్ట్రా రెండు వారాల ముందు.. అంటే డిసెంబర్‌ 8న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక వెంకటేశ్‌ ‘సైంథవ్‌’ అయితే సంక్రాంతి రేసులో దిగుతున్నాడు. వచ్చే సంక్రాంతి పండక్కి గుంటూరుకారం.. హనుమాన్‌.. నా సామిరంగ.. ఈగిల్‌ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ వున్నా.. జనవరి 13న సైంధవ్‌ రావడం షాక్‌ ఇస్తోంది. సంక్రాంతికి వచ్చే సినిమాల లిస్ట్‌లో కొన్ని రావన్న సంగతి తెలిసే సైంధవ్‌ బరిలోకి దిగిందట. క్రిస్మస్‌ సినిమా లిస్ట్‌లో హాయ్‌ నాన్న మాత్రం ఇంకా రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌మెంట్‌కు నోచుకోలేదు. ఎక్స్‌స్ట్రా మాదిరి డిసెంబర్‌ 8న లేదంటే.. 7న రావడం తప్ప మరో ఆప్షన్‌ కనిపించడం లేదు.

ప్రమోషన్‌ స్పీడ్‌ చూస్తుంటే.. డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌లో రావడం ఖాయమనిపిస్తోంది. డిసెంబర్‌ 8న పోటీ మామూలుగా లేదు. ఆల్రెడీ ఇదే రోజున ‘ఆపరేషన్‌ వాలైంటేన్‌’ పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అవుతోంది. ఆల్రెడీ సోనీపిక్చర్స్‌ థియేటర్స్‌ను బ్లాక్‌ చేసుకున్నాయి. 8నే వస్తానన్న విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ షూటింగ్‌ దశలో వుంది. రిలీజ్‌కు టైం సరిపోకపోతే.. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ అవుతుంది.