salaar : సలార్ రెండో ట్రైలర్..

సలార్ మూవీ ఈ మధ్య కాలంలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా నిలిచిపోయింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్ పూర్తయ్యి విడుదలకు రెడీగా ఉంది. అయితే పలుమార్లు వాయిదా పడ్డా.. డిసెంబర్ 22న రావడం పక్కా అని కన్ఫమ్ చేసేసింది చిత్ర యూనిట్.

సలార్ మూవీ ఈ మధ్య కాలంలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా నిలిచిపోయింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్ పూర్తయ్యి విడుదలకు రెడీగా ఉంది. అయితే పలుమార్లు వాయిదా పడ్డా.. డిసెంబర్ 22న రావడం పక్కా అని కన్ఫమ్ చేసేసింది చిత్ర యూనిట్. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. ఈ డైనో‌సర్‌ను న్యూ లుక్‌లో చూసి డార్లింగ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ప్రభాస్ ఊర మాసిజాన్ని చూడబోతున్నామన్న ఆనందలో ఉన్నారు. ఈ ట్రైలర్ సినిమాలపై అంచనాలు పెంచితే.. ఇదే కాదూ.. మరో ట్రైలర్ కూడా ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఇటీవల ట్రైలర్‏తో ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పేశాడు నీల్. ఇప్పటివరకు ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించని మాస్ యాక్షన్ కంటెంట్ ఈ సినిమాలో ఉండనుందని తెలుస్తోంది. బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా వచ్చిన సూరీడు సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండడంతో రోజు రోజుకీ ఎగ్జైట్మెంట్ పెరుగుతూ వస్తుంది. దీంతో ఫ్యాన్స్ ను మరింత ఖుషి చేయడానికి రెండో ట్రైలర్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి ట్రైలర్ లో దేవా వెర్షన్ లో ప్రభాస్ విట్నెస్ చేస్తే.. ఇక ఇప్పుడు రెండో ట్రైలర్ లో సలార్ గా ప్రభాస్ కనిపించే వెర్షన్ చూపించనున్నారని తెలుస్తోంది. దేవా నుంచి సలార్ గా ప్రభాస్ ఎలా మారాడు అన్నది సెకండ్ ట్రైలర్ లో ఉండనుందని బజ్ వినిపిస్తోంది. దీంతో ఈ సెకండ్ ట్రైలర్ ఏ లెవల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న అప్డేట్ ప్రకారం డిసెంబర్ 17న ఈ సినిమా రెండో ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.