SALAAR: సలార్‌తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించామని చెబుతున్నారు నిర్మాత విజయ్ కిరగందూర్. సలార్ అనుకున్న విధంగా చేసేందుకు మాకు ఎక్కువ సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. అందుకే సలార్ ప్రయాణం మాకు ఎప్పటికి గుర్తుండిపోయే అనుభవాన్నిచ్చిందని అన్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా సలార్.
మొదటి భాగం సలార్ 1 సీజ్ ఫైర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా హోంబలే ప్రొడక్షన్స్ నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. కె.జి.ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయడం.. అందులో ప్రభాస్ నటించడం వల్ల సలార్ మీద తారస్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు తగినట్టుగానే మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా నిర్మించామని అన్నారు. ఇక సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయలని అనుకున్నాం కాబట్టి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఈ సినిమా ప్రయాణం ఒక అద్భుతమని, సలార్ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ సపోర్ట్, ఇక్కడి ప్రేక్షకుల సహకారం ఎంతో ఎంకరేజ్ చేసిందని అన్నారు విజయ్.
ఇక.. సలార్ దెబ్బకు బద్దలవడానికి, బాలీవుడ్ పాత రికార్డులు వేచిచూస్తున్నాయి. ఫస్ట్ షో పడగానే మొదలయ్యే సలార్ సునామి, సంక్రాంతి వరకు విరుచుకుపడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్న సలార్ టికెట్లను చూసి, హిందీ మేళం అంతా కొంత పరేషాన్‌లో పడింది. ఇంత క్రేజ్ సంపాదించిన సలార్ మూవీ.. ఇంకొన్ని గంటల్లో తన విశ్వరూపాన్ని చూపెట్టనుంది.