Salaar: బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ పీక్స్‌కు చేరింది. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు, నటులు అతడితో పనిచేసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్‌తో అలరించనప్పటికీ.. సంథింగ్ ఏదో అతడి నుంచి ఎక్సెప్ట్ చేస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. దానికి కారణం సాహో మినహాయించి.. మిగిలిన రెండు చిత్రాలు ఆకట్టుకోలేకపోవడమే. ఇప్పుడు క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ సలార్‌తో ఈ లోటును పూడ్చేందుకు సిద్ధమయ్యాడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్.
Unstoppable : అన్‌స్టాపబుల్ రచ్చ.. రణబీర్ నోటా బాలయ్య డైలాగ్స్
పలుమార్లు ఈ సినిమా వాయిదా పడినప్పటికీ.. మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కేజీఎఫ్ సిరీస్‌తో టాప్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ సలార్. రెండు పార్టులుగా సినిమా ఉండబోతున్న సంగతి విదితమే. సలార్ -1 సీజ్ ఫైర్ పై విపరీతమైన హైప్ వచ్చేసింది. విడుదల ఆలస్యం మినహాయించి దీనిపై ఎటువంటి నెగిటివ్ వైబ్స్ లేవు. ఈ డిసెంబర్‌లో రావడం పక్కా అంటూ ప్రకటించడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు అభిమానులు. అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటికే భారీ బిజినెస్ జరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు భారీ రేట్లకు కొనుకున్నాయని తెలుస్తోంది. ఇక్కడే కాకుండా నైజాంలో రూ. 90 కోట్లకి మైత్రీ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది.
అలాగే కర్ణాటకలో ఈ మూవీ నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్ మొత్తంగా విడుదల చేస్తోంది. ఇక మలయాళంలో ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళనాట ఆ రాష్ట్ర ముఖమంత్రి ఎంకె స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జైంట్ మూవీస్ భారీ రేటుకు రైట్స్ కొనుగోలు చేశారు. ఇక నాన్ థియేటరికల్ రైట్స్ కూడా భారీగా ముట్టిందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంతే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న బాలారిష్టాలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి. సినిమా విడుదల ఒక్కటే కాదూ.. మూవీ కలెక్షన్ల కూడా కీలకమే.
Neha Shetty: చిలకపచ్చ కోకలో నేహా శెట్టి.. లేటెస్ట్ ఫొటోస్..
ఈ మూవీ కొన్న బయ్యర్లు నష్టపోకుండా ఉండాలంటే .. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాల్సి ఉంటుంది. టికెట్ పై కనీసం 50 నుంచి 70 రూపాయల వరకు పెంచితేనే.. లాభాల పడుతుంది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే టికెట్స్ రేట్లే కాదూ.. అదే రేంజ్‌లో సినిమా ఉంటేనే బయ్యర్లు సేఫ్ జోన్‌లో ఉంటారు. కొన్ని సార్లు ఎక్స్ పక్టేషన్స్ కూడా శాపంగా మారుతుంటాయి.