Salaar : సలార్ వాయిదాతో ప్లాన్ మార్చాన సైంధవ్

సలార్ కొత్త రిలీజ్ డేట్ టాలీవుడ్ మేకర్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్ ని టార్గెట్ చేసిన ప్రాజెక్ట్స్ లో అయోమయం ఏర్పాడింది. దీంతో అలెర్ట్ అయిన సైంధవ్ టీం ఇప్పుడు కొత్త స్ట్రాటజీ తెరపైకి తెస్తోంది.

సలార్ కొత్త రిలీజ్ డేట్ టాలీవుడ్ మేకర్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్ ని టార్గెట్ చేసిన ప్రాజెక్ట్స్ లో అయోమయం ఏర్పాడింది. దీంతో అలెర్ట్ అయిన సైంధవ్ టీం ఇప్పుడు కొత్త స్ట్రాటజీ తెరపైకి తెస్తోంది. ప్లాన్ బి అప్లై చేసే పనిలో బిజీ అయింది. సలార్ పోస్ట్‌పోన్ అవ్వడంతో సెప్టెంబర్ 28ని మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కబ్జా చేశాయి. ఇప్పుడు డిసెంబర్ 22కి సలార్ రిలీజ్ అంటూ కొత్త డేట్ తెరపైకి వచ్చింది. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆ డేట్ ఫిక్స్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో వెంకటేష్ సైంధవ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆ డేట్ ని సైంధవ్ కోసం లాక్ చేశాడు వెంకటేష్.ఆ రోజు షారుఖ్ డుంకీ, ముందు వెనుకా హాయ్ నాన్న, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ ఉన్నా వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నాడు. తీరా చూస్తే ఇప్పుడు సలార్ సడన్ షాక్ ఇచ్చింది. దీంతో అలర్ట్ అయిన యూనిట్ సైంధవ్ కోసం ప్లాన్ బి అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది.

సలార్ డిసెంబర్ లో వస్తే సైంధవ్ ని 2024 సంక్రాంతి బరిలో దింపాలని చూస్తోంది యూనిట్. ఎలాగో ఆ టైం కి ప్రాజెక్ట్ కె రావడం లేదు. గుంటూరు కారం బరిలో ఉన్న పండక్కీ కనీసం ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలతో స్పేస్ ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఈగల్, VD13, హనుమాన్ సినిమాలు డేట్స్ అనౌన్స్ చేసిన ఏవి ఖచితంగా వస్తాయో ఇప్పుడే చెప్పలేం. అందుకే కంటెంట్ మీద నమ్మకంతో సైంధవ్ ని జనవరి 13న రిలీజ్ చేయడానికి మేకర్స్ పక్కా స్ట్రాటజీ రెడీ చేస్తున్నారు.

నిజానికి సంక్రాంతి బరిలో సినిమాల నెంబర్ పెరిగితే థియేటర్ల సమస్య వస్తుంది. కానీ సైంధవ్ కి ఆ సమస్య లేదు. వెంకటేష్ సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్ కే సొంత డిస్ట్రిబ్యూషన్, థియేటర్ నెట్ వర్క్ ఉంది. అందుకే సైంధవ్ రిలీజ్ డేట్ మారిన బిజినెస్ లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదంటున్నారు క్రిటిక్స్. మొత్తానికి వచ్చే సంక్రాంతికి పోటీ రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది.సైంధవ్ కనక సంక్రాంతికే ఫిక్స్ అయితే మూడు పెద్ద సినిమాల మధ్య భారీ ఫైట్ తప్పదు.