Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ కేవలం గ్రాఫిక్ వర్క్ నచ్చకే ప్రశాంత్ నీల్ ఈ సినిమా విడుదలను వాయిదా వేశాడు. మొత్తం గ్రాఫిక్స్ టీంని మార్చి కొత్త ఔట్‌పుట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అలాగని సినిమాలోని టోటల్ గ్రాఫిక్స్ బాలేదని కాదు. అదే నిజమైతే ఈ మూవీ వచ్చే రెండు, మూడు నెలలు కాదుకదా.. కనీసం ఆరునెలల వరకు వచ్చే ఛాన్స్ లేదు. కాని ఫిల్మ్ టీం ప్లానింగ్ చూసినా, రిలీజ్ డేట్ల బ్యాకప్ ప్లానింగ్ చూసినా సలార్ రిపేర్ వర్క్ మరీ ఎక్కువ టైం పట్టదని తెలుస్తోంది.
ఇక రిలీజ్ డేట్ల విషయానికొస్తే నవంబర్ 10, డిసెంబర్ 20 అలానే జనవరి 12 అని.. ఇలా ఎప్పుడు కుదరితే అప్పడు అనేలా మూడు ముహుర్తాలు చూసుకుంది. అంతా అనుకున్నట్టు జరిగితే నవంబర్ 10న.. అంటే దీపావళికి సలార్ రిలీజ్ అవ్వొచ్చు. అది కూడా దసరాకి రెండు రోజుల ముందు ఫస్ట్ కాపీ వస్తుందట. అప్పుడు వర్క్ బాగుందంటే ఓకే.. లేదంటే, మళ్లీ రిపేర్లు జరగొచ్చు. అలా కాకుండా దసరాలోపు గ్రాఫిక్ వర్క్ తాలూకు రిపేర్లు జరక్కపోతే క్రిస్మస్ స్పెషల్‌గా సలార్‌ని డిసెంబర్ 20కి విడుదల చేయాలనుకుంటున్నారట. అంటే దీపావళి మిస్ అయినా క్రిస్మస్‌కి సలార్ రావటం ఆల్ మోస్ట్ కన్ఫామ్.
ఐతే ఇక్కడే ఏదో ఉపద్రవం వచ్చి సలార్ వాయిదా పడితే ఎలా అన్న ప్రశ్నకి.. సంక్రాంతికి చివరి డెస్టినేషన్‌గా బ్యాకప్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. సో.. ఈ మూడు డేట్లలో ఏదో ఒక ముహుర్తానికి సలార్ రావటం ఫైనల్ అయినట్టే.