Salaar: ఒక్క తప్పుతో రూ.150 కోట్లు నష్టపోయిన సలార్ నిర్మాతలు..?

సలార్ మూవీ ఏపీ, తెలంగాణ రైట్స్‌ని 300 కోట్లకు కోట్ చేసిన ఫిల్మ్ టీం ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడాల్సి రావటంతో ఒక మెట్టు తగ్గి దిగిరావాల్సి వస్తోంది. కారణం.. సినిమా వాయిదా పడిందంటే డిస్ట్రిబ్యూటర్లకు డిమాండ్ చేసే వాయిస్ పెరుగుతుంది.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 04:39 PM IST

Salaar: రెబల్ స్టార్‌తో ప్రశాంత్ నీల్ తీసిన సలార్ ఈ నెల28న రావాలి. కాని సినిమా వాయిదా పడటంతో దీపావళికే బాక్సాఫీస్‌లో పటాసుల పండగన్నారు. అంతా బానే ఉంది. కరెక్ట్‌గా రెండు నెలల గ్యాప్ తర్వాత సలార్ వస్తుందని తేలింది. కాని ఈ వాయిదా వల్ల వచ్చిన నష్టం అక్షరాల రూ.150 కోట్లు. సలార్ మూవీ ఏపీ, తెలంగాణ రైట్స్‌ని 300 కోట్లకు కోట్ చేసిన ఫిల్మ్ టీం ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడాల్సి రావటంతో ఒక మెట్టు తగ్గి దిగిరావాల్సి వస్తోంది.

కారణం.. సినిమా వాయిదా పడిందంటే డిస్ట్రిబ్యూటర్లకు డిమాండ్ చేసే వాయిస్ పెరుగుతుంది. ఆల్రెడీ ఓటీటీలో పెద్ద హీరోల మూవీలు రిలీజ్‌కి ముందే వందలకోట్లు పెట్టి కొనకూడదని నిర్ణయించాయి. కాబట్టి ప్రభాస్‌కి ఎంత క్రేజ్, మార్కెట్ ఉన్నా సలార్ రిలీజై టాక్ బాగున్నాకే ఓటీటీలు కొనాలనే తీర్మానం వచ్చేసింది. కాబట్టి అన్ని వైపుల నుంచి సలార్ మూవీకి ఇబ్బందులే ఎదురయ్యాయి. దీనికి కారణం గ్రాఫిక్స్ వర్క్ సరిగా పూర్తికాకపోవటమే. ఈ నేపథ్యంలో వాయిదా తప్ప మరో ఛాన్స్ లేదని ఇలా చేశారట.

దీని ఫలితంగా ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 300 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందట. ఫిల్మ్ టీం కూడా డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్‌కి తలొగ్గటంతో, ఈ మూవీకి విడుదలకు ముందే రూ.150 కోట్ల నష్టం వచ్చినట్టు అంటున్నారు.