SALAAR: సలార్ మూవీ ఈనెల 22 న రాబోతోంది. టీజర్ వచ్చినప్పుడున్నంత ఆసక్తి ఇప్పుడు ఈ సినిమాపై ఉండట్లేదు. కారణం ఫిల్మ్ టీం వదిలిన ట్రైలర్. అయితే ఇది ఇద్దరు మిత్రుల కథ కావటంతో ముందు పృథ్విరాజ్ వర్షన్ ట్రైలర్ వదిలారు. ఈనెల 16న హీరో ప్రభాస్ వర్షన్ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. అదే అసలైన సలార్ ట్రైలర్ అంటున్నారు. సరే అంచనాలను కాస్త తగ్గించేందుకే ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారనుకుంటే ఓకే. లేదంటే సమస్యే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సీన్‌లోకి కేజీయఫ్ 3 ని తీసుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
Prabhas, Shah Rukh Khan : ప్రభాస్‌తో పోటీ పడలేనంటున్న షారూక్
కేజీయఫ్ 3 కథ ఎప్పుడో సిద్దమైందన్నాడు. యష్‌తో తన మూడో కేజియఫ్ ఉంటుందన్నాడు. కాని ఎప్పుడో తేల్చలేదు. కాకపోతే సలార్ తర్వాత తారక్‌తో మూవీ ప్లాన్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ఆతర్వాత సలార్ 2 తెరకెక్కిస్తాడట. అది కూడా సలార్ రిజల్ట్ కలిసొస్తేనే. లేదంటే దాని ప్లేస్‌లోనే కేజీయఫ్ 3 ఉండే ఛాన్స్ ఉంది. అలా కాకుండా సలార్ హిట్టైతే, తర్వాత తారక్ మూవీ, ఆతర్వాతే సలార్ 2, ఆ తర్వాత కేజీయఫ్ 3ని ప్లాన్ చేస్తాడట ప్రశాంత్ నీల్. ఇదంతా తన ప్రస్తుత ప్లానింగ్. అదెంత వరకు మారుతుందో తారక్ మూవీ మొదలయ్యే దాన్ని బట్టే ఉంటుందట. అంతవరకు బానే ఉంది. కాని, సలార్ ట్రైలర్‌కి వీక్ టాక్ రావటం, ఇంతలో కేజీయఫ్ 3 ని సీన్‌లోకి ప్రశాంత్ నీల్ తీసుకురావటమే అర్ధం కాని మ్యాటర్.
ఎప్పుడో తెరకెక్కే ఛాన్స్ ఉన్న కేజీయఫ్3 గురించి ఇప్పుడు ప్రస్థావన వచ్చిందంటేనే, సలార్ ప్రమోషన్‌కి కేజీయఫ్ 3 గాసిప్స్‌ని బిస్కెట్‌గా వాడుతున్నాడు ప్రశాంత్ అంటున్నారు. త్రిబుల్ ఆర్ రిలీజ్ కిముందు బాహుబలి 3 ఉందని రాజమౌళి అన్నాడు. త్రిబుల్ ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నటైంలో త్రిబుల్ఆర్‌కి సీక్వెల్ ఉందన్నాడు జక్కన్న. ఈరెండూ కూడా జనాల్లో అటెన్షన్ పెంచటానికే అని చాలా మంది తేల్చారు. అంటే సలార్ ప్రమోషన్ కోసం కేజీయఫ్ 3 ప్రస్తావనని ప్రశాంత్ నీల్ తెస్తున్నాడా అనే డౌట్లు పెరిగాయి. అదే నిజమనుకునే మాటలే వినిపిస్తున్నాయి.