Salaar Song: ఎమోషనల్ టచ్.. సలార్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

లార్ నుంచి కొద్దిసేపటి క్రితమే సెకండ్ సాంగ్ విడుదల అయ్యింది. అలా విడుదల అయ్యిందో లేదో యుట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 06:07 PM IST

Salaar Song: ఇంకెంత.. మహా అయితే ఎనిమిది గంటలు. అంటే మిడ్ నైట్ ఒంటి గంట నుంచి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సలార్ సునామి ప్రారంభం కాబోతుంది. ప్రభాస్ ఫాన్స్ మొట్టమొదటి సారిగా గడియారాలకి దణ్ణం పెడుతు త్వరగా ఒంటి గంట అవ్వాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఆ టైం దాకా ఇది వింటు హీరోలా తయారవ్వండి అంటూ మేకర్స్ సలార్‌కి సంబంధించిన రెండో పాటని విడుదల చేసారు.

OTT CENSOR: ఓటీటీ వీక్షకులకు కేంద్రం షాక్.. ఇకపై ఆ వెర్షన్స్ ఉండవ్.. 

సలార్ నుంచి కొద్దిసేపటి క్రితమే సెకండ్ సాంగ్ విడుదల అయ్యింది. అలా విడుదల అయ్యిందో లేదో యుట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. పాట వింటున్నప్పుడు అణిచివేతకి గురయ్యే ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. అంతలా ఆ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు. అణచగనే పుడతాడు రాజే ఒకడు. శత్రువునే కడతేర్చే పనిలో మన రాజు అనే పల్లవితో ప్రారంభం అయిన పాట చివరి దాకా కూడా అంతే టెంపోని కొనసాగిస్తూ సూపర్‌గా ఉంది. చిన్న పిల్లల స్కూల్ తరగతి గదిలో ప్రారంభం అయిన ఆ పాటలో టీచర్‌గా ఉన్న ఈశ్వరి రావు ఒక పిల్లవాడ్ని లేపి నేను నేర్పించిన పాట గుర్తుంది కదా పాడు అనగానే ఆ పిల్లవాడు పాడటం ప్రారంభిస్తాడు.

ఆ సాంగ్‌లో శృతి హాసన్‌తో పాటు ప్రముఖ కామెడీ నటుడు సప్తగిరి కూడా కనిపించాడు. అలాగే సాంగ్ చివరిలో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా స్కూల్‌లోని బోర్డు మీద విజయాలు యుద్ధాల వలన రావు.. ఇవ్వడం, క్షమించడం వలన వస్తాయి అనే కొటేషన్ ఉంది. మొత్తానికి ఈ పాటలో లిరిక్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతున్నాయి. ఆ పాటతో మూవీకి మరింత హైప్ వచ్చింది.