SALAAR: హార్ట్ టచింగ్‌గా సలార్ సాంగ్.. ప్రభాస్ ఎమోషనల్

సాహో సినిమా యావరేజ్ టాక్‌తోనే హిందీలో రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు సలార్ హిందీ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. షారుఖ్ ఖాన్ డంకీ థియేటర్లలో ఉన్నా కూడా ప్రభాస్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవుతోంది.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 02:05 PM IST

SALAAR: ఎక్కడ చూసినా మూవీ లవర్స్ సలార్ గురించే చర్చించుకుంటున్నారు. ఆడియెన్స్ ప్రభాస్ కటౌట్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ గురించి మాట్లాడుతుండగా.. ట్రేడ్ వర్గాలు బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చించుకుంటున్నాయి. ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌కు రిపీట్ మోడ్‌లో థియేటర్లకు పరుగులు తీస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది సలార్. వరుసగా మూడు ఫ్లాప్‌లు పడ్డా కూడా ప్రభాస్ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతుంది అనడానికి ఈ లెక్కలు జస్ట్ శాంపిల్ మాత్రమేనని చెప్పాలి.

BIG BOSS CASE : బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇకపై ర్యాలీలు నిషేధించే ఛాన్స్ !

సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ‘సలార్’ హవా నడుస్తోంది. సాహో సినిమా యావరేజ్ టాక్‌తోనే హిందీలో రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు సలార్ హిందీ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. షారుఖ్ ఖాన్ డంకీ థియేటర్లలో ఉన్నా కూడా ప్రభాస్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవుతోంది. ఇవాళ సలార్ సినిమా నుంచి సాంగ్ విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘వినరా.. ఈ పగలు, వైరం మధ్య త్యాగంరా..’ అంటూ సాగే ఈ సాంగ్ వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఈ పాటలోని లిరిక్స్ ప్రభాస్ క్యారెక్టర్ కోసమా అనిపిస్తాయి. అలాగే లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. సలార్ సినిమా కథ ప్రాణ స్నేహితులు.. బద్ద శత్రువులుగా మారినతీరును ప్రశాంత్ నీల్ బాగా హైలెట్ చేశాడు.

సినిమా హీరో ప్రభాస్.. అతని స్నేహితుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు ఈ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఎపిసోడ్‌తో వచ్చే వినరో పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. స్నేహంపై ఎమోషన్స్‌తో కూడిన ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. పాట అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే రికార్డుల మోత మొదలైంది.