SALAAR: ప్రభాస్ ఫ్యాన్స్.. గెట్ రెడీ.. మోస్ట్ అవైటెడ్ సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..!

ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే అవటం, అప్పుడే దసరా సందడి ఉండటంతో, ప్రశాంత్ నీల్ అండ్ టీం ఈ రెండు పండగలకి డబుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సలార్ ట్రైలర్‌ని 23న లాంచ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది. రెండు నిమిషాల 45 సెకన్లతో రెండు వర్షన్స్‌లో ట్రైలర్స్ రెడీగా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 06:21 PM IST

SALAAR: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే ట్రీట్ రెడీ చేస్తోంది ప్రశాంత్ నీల్ టీం. ఓవైపు మోకాలి సర్జరీ వల్ల ప్రభాస్ ఇప్పుడు కల్కితోపాటు మారుతి మూవీ షూటింగ్‌లో కూడా జాయిన్ కాలేకపోతున్నాడు. ఆ విషయంలో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ హెల్త్ రికవరీ మీద కంగారుగా ఉన్నారు. ఐతే ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే అవటం, అప్పుడే దసరా సందడి ఉండటంతో, ప్రశాంత్ నీల్ అండ్ టీం ఈ రెండు పండగలకి డబుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సలార్ ట్రైలర్‌ని 23న లాంచ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది.

రెండు నిమిషాల 45 సెకన్లతో రెండు వర్షన్స్‌లో ట్రైలర్స్ రెడీగా ఉన్నాయి. ఆ ట్రైలర్స్‌ని ప్రభాస్ చూసి ఓకే చేయటంతోపాటు వాటికి డబ్బింగ్ చెబితే ప్రోమోలు రెడీ అయినట్టే. అందుకే యూరప్‌లో మోకాలి సర్జరీ తర్వాత అక్కడే ఉన్న ప్రభాస్ కోసం బంధువులు అక్కడికి వెళుతున్నారు. ట్రైలర్‌ని ఫైనలైజ్ చేస్తూ, ప్రభాస్‌తో డబ్బింగ్ చెప్పించుకునేందుకు ప్రశాంత్ నీల్ టీం కూడా యూరప్ ట్రిప్ ప్లానింగ్‌లోఉంది. అంటే దసరా రోజులోగా ఈ పనులన్నీ పూర్తి చేసి, సలార్ ట్రైలర్‌ని రిలీజ్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక దీపావళికి సలార్ మాంటేజ్ సాంగ్‌ని కూడా రిలీజ్ చేయాలని ఇప్పుడే నిర్ణయించినట్టు తెలుస్తోంది.