SALAAR Vs DEVIL: సలార్‌ వర్సెస్ డెవిల్‌.. సలార్‌తో పోటీకి సై అంటున్న కళ్యాణ్ రామ్ డెవిల్‌ 

సలార్‌ రాకతో ఇదే క్రిస్మస్‌ సీజన్‌లో రావాల్సిన హాయ్‌ నాన్న, ఎక్స్‌స్ట్రా, సైంథవ్‌ రిలీజ్‌ డేట్స్ మారిపోయాయ్. ఐతే నందమూరి కల్యాణ్‌రామ్‌.. సలార్‌కు భయపడడం లేదు. పైగా తాడోపేడో తేల్చుకుంటాడంటున్నాడు.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 07:00 PM IST

SALAAR Vs DEVIL: సలార్‌తో పోటీ తట్టుకోలేక ఇద్దరు యంగ్ హీరోలు నితిన్‌, నాని.. ఒక సీనియర్‌ హీరో వెంకటేశ్‌ తమ సినిమాలను వాయిదా వేసుకుంటే.. ఓ హీరో మాత్రం తగ్గేదే లేదంటూ ఢీ కొడతానంటున్నాడు. పాన్‌ ఇండియా మూవీ సలార్‌ను ఢీకొడుతున్న మరో పాన్‌ ఇండియా మూవీ డెవిల్. సెప్టెంబర్‌ 28న రావాల్సిన సలార్‌ డిసెంబర్‌ 22కు వెళ్లిపోయింది. సలార్‌ రాకతో ఇదే క్రిస్మస్‌ సీజన్‌లో రావాల్సిన హాయ్‌ నాన్న, ఎక్స్‌స్ట్రా, సైంథవ్‌ రిలీజ్‌ డేట్స్ మారిపోయాయ్.

Sreeleela: శ్రీలీలకి డేంజర్‌ బెల్స్ మోగుతున్నాయా..? వరుస ఫ్లాపులతో సాగుతున్న కెరీర్..

ఐతే నందమూరి కల్యాణ్‌రామ్‌.. సలార్‌కు భయపడడం లేదు. పైగా తాడోపేడో తేల్చుకుంటాడంటున్నాడు. నవంబర్‌ 24న రావాల్సిన కళ్యాణ్‌రామ్‌ డెవిల్‌.. డిసెంబర్‌ 29న రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. మాంచి క్రేజ్‌ వున్న పాన్‌ ఇండియా మూవీస్‌తో పోటీ పడడానికి నిర్మాతలు ఇష్టపడరు. రెండు వారాల గ్యాప్‌ తర్వాత రిలీజ్‌ చేస్తారు. ప్రభాస్‌ వరుస ఫ్లాపుల్లో ఉన్నా.. కేజీఎఫ్‌2 వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత వస్తున్న ప్రశాంత్‌ నీల్‌ మూవీ కావడంతో సలార్‌పై భారీ అంచనాలున్నాయ్. ఐనా సరే డెవిల్‌ భయపడడం లేదు. ఐతే డెవిల్ నిర్మాత ఇంత ధైర్యం చేయడానికి ఓ కారణం ఉంది. ఆ నిర్మాతకు మరో ఆప్షన్‌ కనిపించలేదు. సలార్‌ వచ్చిన రెండు వారాలకు.. జనవరి ఫస్ట్‌ వీక్‌లో రిలీజ్‌ చేస్తే.. సంక్రాంతి సినిమాలన్నీ ఒకేసారి మీద పడతాయ్‌.

దీంతో థియేటర్‌లో రెండోవారంలో బొమ్మ కనిపించదు. డిసెంబర్‌ 29న విడుదల చేస్తే.. రెండు వారాల టైం దొరుకుతుంది. దీంతో సలార్‌ వచ్చిన వారానికే డెవిల్‌ రాబోతోంది.