సలార్ (Salaar) ఫస్ట్ పార్డ్ చూసిన వారంతా.. రెండో పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ.. మే నెల చివర్లో సలార్ 2 (Salaar 2) షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) లో ప్రత్యేక సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మే చివరి వారం నుంచి పది రోజుల పాటు జరిగే షెడ్యూల్‌లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారని సమాచారం. ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇతర కమిట్మెంట్స్ వల్ల తన పార్ట్‌కు సంబంధించిన సన్నివేశాలను ముందుగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఆ దిశగా డిస్కస్ కూడా చేసుకున్నట్లు టాక్. ఎట్టిపరిస్థితుల్లోను.. ఈ ఏడాది అక్టోబర్ వరకు సలార్ షూట్ కంప్లీట్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారట. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టి.. సలార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో 2025లోనే సలార్ 2 (Salaar 2) రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట.
అది కూడా సెంటిమెంట్‌లో భాగంగా.. సలార్ పార్ట్ 1 రిలీజ్ అయిన డిసెంబర్ నెలలోనే.. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ లెక్కన 2025 డిసెంబర్ 25న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆరోజు క్రిస్మస్ హాలీడే ఉంది. పైగా గురువారం అవుతోంది. కాబట్టి.. లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా.. ఆరోజే శౌర్యాంగ పర్వం (Shauryanga Parvam) రిలీజ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి సలార్2 ఎలా ఉంటుందో చూడాలి.