Salar : సలార్ సరికొత్త రికార్డు..

సలార్ వచ్చే ఘడియలు దగ్గరవుతున్నాయి. ఇంకొక్క వారం ఎదురు చూస్తే ప్రభాస్ ఊర మాస్ యాక్షన్ ట్రీట్ ని చూసేందుకు అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. పైగా ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది.

కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకున్న ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఈ ఏడాది అత్యంత వేగంగా 1 మిలియన్ కు పైగా యూఎస్ ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్ జరిగిన సినిమా నిలిచింది.

ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ అయ్యాయి. అక్కడ దుమ్ము రేగిపోతున్నాయి. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూరప్ దేశాల్లో టికెట్ల ఓపెనింగ్ కాగానే.. చాలా క్విక్‌గా అమ్ముడయ్యాయి. యూఎస్‌లో ఓ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి రిలీజ్ కు ముందే సలార్ .. అరాచకం నెక్ట్స్ లెవల్ అని తెలుస్తోంది.