వణికిపోతున్న సల్మాన్, బిగ్ బాస్ హౌస్ సెట్ లో వాళ్ళకే ఎంట్రీ

సినిమాల్లో వందల మందిని చంపే హీరో ఇప్పుడు బతుకు జీవుడా అంటూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. బండి సైలెన్సర్ బీట్ వినపడినా దాక్కునే పరిస్థితి. లక్షలాది మంది అభిమానులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు, భారీ సెక్యూరిటీ...

  • Written By:
  • Publish Date - October 19, 2024 / 11:35 AM IST

సినిమాల్లో వందల మందిని చంపే హీరో ఇప్పుడు బతుకు జీవుడా అంటూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. బండి సైలెన్సర్ బీట్ వినపడినా దాక్కునే పరిస్థితి. లక్షలాది మంది అభిమానులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు, భారీ సెక్యూరిటీ… అయినా లోపల ఏదో తెలియని భయంతో ఆ సూపర్ స్టార్ వెన్నులో వణుకు పుడుతోంది. ఓ 31 ఏళ్ళ యువకుడి దెబ్బకు ఇప్పుడు ఓ స్టార్ హీరో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. జల్సా రాయుడు అనే పేరున్న ఆ హీరో… పోలీసుల భారీ భద్రత నడుమ ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు.

ఇంతకు ఆ హీరో ఎవరో మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఆయన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే సల్మాన్ కు నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం చేసిన ఓ పాపం ఇప్పుడు ఇలా వెంటాడుతుందని సల్మాన్ ఖాన్ కలలో కూడా ఊహించలేదు. న్యాయస్థానం క్షమించినా, పోలీసులు బయట తిరిగే స్వేచ్చ ఇచ్చినా లారెన్స్ బిష్ణోయ్ మాత్రం వెంటాడుతున్నాడు. ఎప్పుడు వేటాడతాడో అనే భయంతో సల్మాన్ ఖాన్ తన జీవితాన్ని ఐసోలేట్ చేసుకుని బ్రతుకుతున్నాడు.

ఒకరకంగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నాడు. సినిమా షూటింగ్ లకు వెళ్ళడం లేదు, బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళాలన్నా సరే భయం భయంగా అడుగులు వేస్తున్నాడు. లారెన్స్ బిష్ణోయ్… బాబా సిద్దిఖీని కాల్చి చంపిన తర్వాత సల్మాన్ ఖాన్ లో ప్రాణ భయం స్పష్టంగా కనపడింది. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో షూటింగ్ కి వెళ్ళడానికి కూడా వెనకడుగు వేస్తున్నాడు. ముందు బిగ్ బాస్ షూటింగ్ క్యాన్సిల్ చేసి మరో నటుడితో కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. వై కేటగిరి భద్రత ఉన్నా సరే సల్మాన్ రానని తేల్చి చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ సెట్ లో 60 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఆ 60 మంది సల్మాన్ షూటింగ్ అయ్యే వరకు అక్కడే ఉండి… ఆయనను ఇంటికి క్షేమంగా పంపించాల్సి ఉంటుంది. ఇక సెట్ లోకి ఎవరైనా రావాలంటే ఆధార్ కార్డు చూపించాలి, వారికి గుర్తింపు కార్డు ఉండాలి. ఇక సల్మాన్ లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఎవరైనా బయటకు వెళ్ళాలంటే అనుమతి లేదు. అభిమానులకు కూడా సల్మాన్ ను కలవడానికి అనుమతి లేదు. శుక్రవారం వీకెండ్ కా వార్ షూట్ ఉంటుందట. ఆ షూట్ కోసం సల్మాన్ ముందుగానే హౌస్ కు వచ్చేశారట. దీనితో భద్రతను కట్టుదిట్టం చేసారు అధికారులు.