సోషల్ మీడియాలో సామ్ ఇంత యాక్టీవ్‌గా కనిపించి దాదాపు ఏడాదవుతోంది. మయోసైటిస్ తర్వాత ఆర్నెల్లపాటు ఇంటికే పరిమితమై ట్రీట్మెంట్ తీసుకుంది.వ్యాధి నుంచి కోలుకున్న సామ్… మధ్యలో ఆగిపోయిన ఖుషీ షూటింగ్లో పాల్గొంది. సిటాడెట్ అనే వెబ్ సిరీస్స్టార్ట్ చేసింది. శాకుంతలం ప్రమోషన్లో పాల్గొంటూ.. ఆమద్య పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంది.
సామ్ అసలు బైట కంటే సోషల్ మీడియాలోనే యమా యాక్టీవ్. ఏం చెప్పాలనుకున్నా.. ఇన్‌స్టాను వేదికగా తీసుకుంటుంది. ఇలా పోస్టులు పెట్టి పెట్టి.. 25 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించింది. అరుదైన వ్యాధితో ఆర్నెల్లపాటు పోస్టులకు దూరంగా వుంది. ఆరోగ్యం కుదుటపడడంతో.. సోషల్ మీడియాను మళ్లీ హీటెక్కిస్తోంది సామ్.
చైతుతో పెళ్లి తర్వాత సామ్ పోస్ట్ చేసిన గ్లామర్ పోస్టులు కాంట్రవర్సీ అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా ఓవర్ ఎక్స్పోజింగ్ ఏంటంటూ..అక్కినేని అభిమానులుఫీలయ్యారు. ఇవేవీ పట్టించుకోకుండా.. తను చేయాలనుకుంది చేసేసేది. చైతుతో విడిపోయాక.. గ్లామర్ డోస్ మరింత పెంచింది. మరి మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్… మళ్లీ రెచ్చిపోతుందా? లేదంటే లిమిట్స్ లో వుంటూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుందో చూడాలి మరి.