Samantha and Vijay Devarakonda: ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ రిలీజ్‌.. లిరిక్స్‌తో మనసుకు హత్తుకున్నారుగా..

విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గానే సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది సినిమా యూనిట్‌. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా మూవీలోని ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజెస్‌లో కూడా ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 01:46 PM IST

నా రోజా నువ్వే అంటూ సాగే సాంగ్‌కి దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ రాశాడు. సంగీత దర్శకుడు అబ్దుల్ వహాబ్ స్వయంగా ఈ సాంగ్‌ పాడాడు. ఇక సాంగ్ మొత్తం కాశ్మీర్ లోయల్లో కథ వెనుక సాగుతుంది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతిగా కనిపించింది. సాంగ్‌లో విజయ్‌, సమంత మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక పిక్చరైజేషన్‌ అద్భుతంగా ఉంది. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సినిమాటోగ్రహీ ఈ సాంగ్‌కు చాలా ప్లస్‌ అయింది.

ఈ సాంగ్‌ని బట్టి చూస్తుంటే సినిమా ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతుని ఇవ్వబోతోందని తెలుస్తుంది. ఇక లైగర్‌తో విజయ్‌కి పాన్ ఇండియా సక్సెస్ మిస్ అయ్యింది. ఈ సినిమాతో ఆ ముచ్చటని తీర్చుకునేలా ప్లాన్‌ చేస్తున్నాడు. శివ నిర్వాణ లవ్ మూవీస్‌ని చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కిస్తాడని ఆడియన్స్ లో మంచి పేరు ఉంది. ఆయన డైరెక్సన్‌లో వచ్చిన నిన్ను కోరి, మజిలీ సినిమాలు ప్రేక్షకుల మనసుని హత్తుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ. ఈ మధ్య కాలంలో సమంతకి కూడా సరైన విజయం లేదు. మరి దర్శకుడు వీళ్లిద్దరికీ మంచి విజయాన్ని అందించి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా? లేదా? చూడాలి.