సమంతా బయోపిక్, యాక్టర్ ఎవరంటే

టాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడటం అనేది చాలా రేర్. అలా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్లను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అప్పట్లో సావిత్రి, తర్వాత శ్రీదేవి, ఆ తర్వాత విజయశాంతి, అనుష్క, సమంతా, సమంతా, సాయి పల్లవి... ఇలా కొందరు మాత్రమే.

  • Written By:
  • Publish Date - October 20, 2024 / 06:36 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడటం అనేది చాలా రేర్. అలా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్లను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అప్పట్లో సావిత్రి, తర్వాత శ్రీదేవి, ఆ తర్వాత విజయశాంతి, అనుష్క, సమంతా, సమంతా, సాయి పల్లవి… ఇలా కొందరు మాత్రమే. ఎందరో హీరోయిన్లు వచ్చినా హీరోలకు వచ్చే రేంజ్ లో స్టార్ ఇమేజ్ మాత్రం కష్టం. అయితే కొందరు హీరోయిన్లు సినిమాల మీద పిచ్చితో సినిమాలే లోకంగా తమ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారు. ఎవరెన్ని విధాలుగా టార్గెట్ చేసినా కెరీర్ ను డిజైన్ చేసుకోవడమే పనిగా పెట్టుకుంటారు.

స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా కష్టపడుతూ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ తరంలో అయితే సమంతా, సాయి పల్లవి ముందు వరుసలో ఉన్నారు. కీర్తి సురేష్… మహానటి సినిమా తర్వాత సరైన హిట్ లేక… స్కిన్ షో చేయడానికి కూడా రెడీ అయింది. అయినా కీర్తికి సరైన హిట్ మాత్రం దక్కలేదు. సమంతా మాత్రం ముందు నుంచి ఏ విషయంలో కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గినా ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఓ సినిమా కార్యక్రమానికి మొన్న హైదరాబాద్ వస్తే ఫ్యాన్స్ ఆమెకు నీరాజనాలు పలికారు. ఆ స్టార్ ఇమేజ్ చూసి అక్కడున్న అలియా భట్ కూడా షాక్ అయింది. ఇక అదే సమయంలో త్రివిక్రమ్ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. ఇంతటి స్టార్ ఇమేజ్ ఉన్న సమంతా జీవితాన్ని తెరపై చూపిస్తే…? కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత రెండు లవ్ స్టోరీలు, ఒక పెళ్లి… ఆమె జీవితానికి చుక్కలు చూపించాయి. దానికి తోడు మయోసైటిస్ అనే అనారోగ్యం కూడా ఆమెను వెంటాడుతోంది. దీనికి వైద్యం కూడా తీసుకుంటుంది సమంతా.

అందుకే ఇప్పుడు ఆమె లైఫ్ స్టోరీని స్క్రీన్ పై చూపించడానికి రెడీ అవుతున్నాడు ఓ డైరెక్టర్. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు… సమంతాకు మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవల సమంతా హైదరాబాద్ వచ్చిన సమయంలో దీనిపై చర్చించాడట. కథ ఎక్కడి నుంచి మొదలవుతుందో కూడా చెప్పాడట. సేవా కార్యక్రమాలు, సినిమాల్లోకి ఎంట్రీ, ప్రేమ వ్యవహారాల్లో పడిన ఇబ్బందులు, అయినా తట్టుకుని నిలబడి ఆదర్శంగా నిలబడటం వంటివి సినిమాలో చూపిస్తా అని… మీరే సినిమా చేయాలని కూడా సమంతాను అడిగాడట. దీనికి సమంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్.