ఏజెంట్ సినిమా పోస్టర్‌ను షేర్ చేసిన సామ్.. హ్యాపీ బర్త్‌డే అఖిల్ అక్కినేని. ఏజెంట్ 28న రాబోతుంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది.. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ హార్ట్ ఎమోజీని యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది కూడా అఖిల్ బర్త్‌డే సందర్భంగా సామ్ విషెస్ చెప్పింది. అయినా అఖిల్ స్పందించలేదు. మరి ఈసారైనా సమంత షేర్ చేసిన పోస్ట్‌కు రిప్లై ఇస్తాడా లేదా అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.
నాగచైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది ఈ పోస్టుతో మళ్లీ ప్రూవ్ అయింది. అఖిల్, సుశాంత్ సినిమాలు రిలీజ్ అయిన ప్రతీసారి.. విషెస్ చెప్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తుంటుంది. దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా, మిహికా, వెంకటేష్ కూతురు అశ్రితతోనూ సామ్‌కు మంచి రిలేషన్ ఉంది. సమంత మయోసైటిస్ బారినపడినప్పుడు.. అఖిల్, దగ్గుబాటి రానా, సుశాంత్, అశ్రిత తదితరులు సమంతకు ధైర్యం చెప్తూ పోస్టులు షేర్ చేశారు. మొత్తానికి చైతన్యతో విడిపోయినప్పటికీ ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి ఫ్యామిలీలతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది సామ్.