విడాకుల తర్వాత తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన సమంత అంతలోనే మయోసైటిస్ బారినపడింది. కొన్ని నెలలు ఇంట్లోనే ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న సామ్.. కోలుకుని ఈ మధ్యే శాకుంతలం ప్రమోషన్లలో పాల్గొంది. ఐతే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సామ్.. హైపర్ బారిక్ థెరపీ చికిత్స తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. తన ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు.
ఐతే అయితే తాను తీసుకుంటున్న చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆమె షేర్ చేశారు. మయోసైటిస్ వ్యాధిలో కండరాల నొప్పులు బాధిస్తాయ్. శరీరమంతటా నొప్పులు ఉంటాయ్. దీంతో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పోవడానికి, ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి వీలుగా సమంత హైపర్ బారిక్ థెరపీ చేయించుకుంటోంది. హైపర్ బారిక్ థెరపీ.. ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంటి చాలా రకాల ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఈ చికిత్స ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా.. న్యూరోడీజెనరిక్ కండీషన్స్, ఆటిజం, ట్రొమాటిక్ బ్రెయిన్ గాయాలకు ఈ థెరపీ పనిచేస్తుంది. ఈ చికిత్సలో దెబ్బతిన్న కణజాలం తిరిగి కోలుకుంటుంది. నిర్ణీత ప్రెజర్ తో కూడిన స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవడమే హైపర్ బారిక్ చికిత్స. ఏమైనా సామ్‌ను ఇలా చూసి అభిమానుల మనస్సు చివుక్కుమంటోంది. ఆ మాస్క్‌లో సామ్‌ను చూసి కొందరైతే కన్నీరు ఆపుకోలేకపోతున్నారు.