Samantha: సమంత సోషల్ మీడియా క్వీన్. ఈ బ్యూటీ ఏం చేసినా ట్రెండ్ అవుతుంటుంది. కొన్ని రోజులుగా మయోసైటిస్‌తో బాధపడుతున్న బ్యూటీ.. ఓ వైపు అమెరికాలో ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే, సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఇక రీసెంట్గా ఖుషి సినిమా ఆడియో ఫంక్షన్లో బ్యూటీ చేసిన రచ్చ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఈ మ్యాటర్ మరిచిపోకముందే.. మరో కొత్త టాపిక్‌తో బ్యూటీ సెన్సేషన్‌గా మారిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్న సామ్.. ఇప్పుడు కొత్త బంధం గురించి ఆలోచిస్తుందట.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది అభిమానులతో తన పర్సనల్ విషయాలు పంచుకుంటూ సందడి చేస్తోంది. రీసెంట్గా కొత్త లవ్‌ను కనుగొన్నాను అంటూ బ్యూటీ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. బ్యూటీ వాలకం చూస్తుంటే రెండో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. పైగా అమ్మడు షేర్ చేసిన ఫోటో అందుకు మరింత బలాన్ని ఇస్తోంది. జిమ్‌లో వర్క్ చేస్తున్న సమంత ఓ వ్యక్తి ఫోటోలు షేర్ చేసింది. వ్యక్తి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది. అయితే ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఎవరు ఆ వ్యక్తి అని సెర్చ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా సామ్.. రిలేషన్ షిప్, లవ్‌కు సంబంధించిన మోటివేషనల్ కోట్స్ ఎక్కువగా షేర్ చేస్తోంది.
దీంతో మరోసారి సామ్ ప్రేమలో పడిందా..? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కొత్త ప్రేమ దొరికిందంటూ తన ఇన్ స్టా స్టోరీలో వెల్లడించింది. ఫౌండ్ న్యూ లవ్ అంటూ ఓ పోస్ట్ చేసింది. అందులో వాటర్ గ్లాస్ పట్టుకున్న తన చేతి పిక్ షేర్ చేస్తూ.. “మెరిసే నీటి కోసం కొత్త ప్రేమ దొరికింది. కొత్త పరిమితులు.. కొత్త ఆవిష్కరణలతో మెరిసే నీటి కోసం కొత్త ప్రేమ దొరికింది” అంటూ రాసుకొచ్చింది. ఆ పోస్ట్ నెట్టింట వైరలవుతున్న టైంలో ఇప్పుడు ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈఫోటోను చూసిన నెటిజన్లు.. సామ్ త్వరలో పెళ్లి చేసుకుంటుంందని కామెంట్స్ చేస్తున్నారు. సామ్ లవ్ మ్యాటర్ తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.