డివోర్స్ తర్వాత సమంతకు అన్నీ కష్టాలే. ఎంచక్కా నాలుగు పాటలు.. పది సీన్స్‌తో సరదాగా నటించేసి కోట్లు వెనకేసుకునేది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ… దెబ్బలు తింటోంది. ఆరోగ్య సమస్యలు చాలవన్నట్టు.. ఆమధ్య షూటింగ్‌లో గాయపడింది. లేటెస్ట్‌గా యాక్షన్ సీన్స్ నుంచి ఉపశమనం^కోసం.. ఐస్ బాత్ టబ్‌లో కూర్చుంది. ఈ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
జీవితంలో ఎదురుదెబ్బలు తిన్న సామ్ శాకుంతలం డిజాస్టర్‌ను పెద్దగా పట్టించుకోలేదు. పని చేయడం వరకే మన పని.. ఫలితం ఆశించొద్దంటూ… శాకుంతలం రిజల్ట్‌పై పోస్ట్ పెట్టింది. ఆ వెంటనే ఇంగ్లీష్ సిటాడెల్ ప్రీమియర్‌కు లండన్ వెళ్లిన సామ్.. ప్రస్తుతం ఇదే వెబ్ సిరీస్ హిందీ వెర్షన్ షూటింగ్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడిపై ఫైట్స్ తీస్తున్నారు. ఆమధ్య రెండు చేతులకు గాయమైన ఫోటోలను పోస్ట్ చేసిన సమంత తాజాగా ఐస్‌టబ్‌లో వున్న ఫోటోను షేర్ చేస్తూ ‘ఇట్స్ టార్చర్ టైమ్’ అని రాసుకొచ్చింది. భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొనడంలో.. ఐస్‌బాత్‌తో ఉపశమనం పొందుతున్నట్టు పేర్కొంది. అయితే ఈమధ్య ఓ డ్రింక్ యాడ్ కోసం కూడా రోప్స్ కట్టుకుని ఫైట్స్ చేసింది. మరి ఈ రెండింటిలో ఏ యాక్షన్ సీన్‌లో అలసిపోయి… ఐస్ టబ్‌లో కూర్చుందో మరి.
సామ్ రెండేళ్లుగా యాక్షన్ సీన్స్ వున్న సినిమాలు.. వెబ్ సిరీస్‌లే ఎంచుకుంటోంది. యశోద సినిమాలో డూప్ లేకుండా ఫైట్స్ చేసింది. తొలి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్2లో యాక్షన్ సీన్స్‌తో ఇంప్రెస్ చేసింది. రెండో హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’లో కూడా భారీ యాక్షన్ సీన్స్ వున్నాయి. దీని కోసం ఆమధ్య ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ ఆ టార్చర్ మనసికంగానా…సారీరకంగాన అర్థం కావడం లేదు. సినిమాలో రోల్స్ కోసం టార్చర్ అనుభవిస్తునాను అంటే సరే నాలుగు రోజులు పోయాక అవే సర్దుకుంటాయి లే అనుకోవచ్చు. కానీ సామ్ మానసికంగా టార్చర్ భరిస్తున్నా అంటే మాత్రం దానికి ముందు ప్రస్తుతానికి లేనట్లే.