మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్ యాక్టింగ్ స్టార్ట్ చేసేసింది. ఇంకా సినిమాల్లోకి పూర్తిగా రాకపోయినా… వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.. వెండితెరపైకి మాత్రం… రొమాంటిక్ సాంగ్‌తో ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. మయోసైటిస్ జబ్బు తర్వాత సామ్ ఆర్నెల్లపాటు ఇంటికే పరిమితమైంది. అసలు కోలుకుంటుందా? లేదా? అన్న భయం అభిమానులకే కాదు… ఆమెకు కూడా ఉండేది. సామ్ పోస్ట్‌లు చూస్తుంటే… ఆమెకొచ్చిన వ్యాధి ఎన్నో అనుమానాలకు తెరలేపింది.
ఎట్టకేలకు కోలుకుని.. హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్‌లో పాల్గొంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని.. సగంలో ఆగిపోయిన ‘ఖుషీ’ మూవీని స్టార్ట్ చేస్తోంది. నార్వేలో హీరోహీరోయిన్లపై రెండు సాంగ్స్ చిత్రీకరిస్తారు.మయోసిటీస్ కాస్త తగ్గుతుందన్నప్పుడు బైటకొచ్చి శాకుతలం టీజర్ రిలీజ్‌లో కూడా పాల్గొంది. సరే యాక్టింగ్ స్టార్ట్ చేసినా… సామ్‌ను పట్టించుకుంటారా…? అవకాశాలు వస్తాయా అనే అనుమానం చాలా మందికి ఉంది. నిన్నటివరకు సమంతకు ఆరోగ్యం బాగోలేదని ఆఫర్స్ రాలేదనుకున్నారు.
కోలుకున్నా కానీ ఇంతవరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. మయోసైటిస్‌కు ముందు సైన్ చేసిన వెబ్ సిరీస్… ఖుషీ మూవీ మాత్రం పూర్తి చేస్తోంది. రంగస్థలం తర్వాత స్టార్ హీరోలు పట్టించుకోవడం మానేసినా.. యంగ్ హీరోతో జత కట్టే అవకాశం కూడా రాలేదు. మున్ముందు సామ్ కెరీర్ ఎలా వుంటుందో చూడాలి మరి. ఆమెని వ్యతిరేకించే వాళ్ళు టాలీవుడ్ లో మున్ముందు చేయనిస్తారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది.