తన జాయ్‌ఫుల్ మూమెంట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని పూర్తిగా తన ఆరోగ్యం మీదే శ్రద్ధ పెట్టింది సమంత. నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత డిప్రెషన్లోకి వెళ్లింది. అప్పటికే మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడింది సమంత. కొన్ని రోజులకు కాస్త సెట్ అయ్యాక సైన్ చేసిన ప్రాజెక్ట్‌లు చకచకా పూర్తి చేసింది. యశోద, శాకుంతలం, రీసెంట్గా విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలు కంప్లీట్ చేసింది. ఈ సినిమాలు పూర్తయ్యాక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సమంత.
మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న తరువాతే సినిమాలు చేస్తానంటూ చెప్పింది. దీంతో సామ్ ఫ్యాన్స్ అంతా తెగ ఫీలయ్యారు. కానీ సమంత మాత్రం హాలిడే ట్రిప్స్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్‌తో కలిసి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఫేమస్ గుళ్లు, పేరు పొందిన పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తోంది. రీసెంట్గా బాలిలో సమంత ఎంజాయ్ చేస్తూ చేసిన పోస్ట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. దీంతో విడాకుల డిప్రెషన్ నుంచి సమంత పూర్తిగా కోలుకుంది అంటున్నారు ఫ్యాన్స్. మయోసైటిస్ నుంచి కూడా ఫాస్ట్‌గా రికవర్ అయ్యి మళ్లీ సినిమాలు చేయాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.