Samantha Injured: షూటింగ్ ప్రాక్టీస్‌లో సమంతకు గాయాలు

సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. వరుస కష్టాలతో సతమతం అవుతున్న సమంతకు మరో గాయం తగిలింది

  • Written By:
  • Publish Date - February 28, 2023 / 04:37 PM IST

సమంత రుతుప్రభు, అందంతోనే కాకుండా, అభినయంతో కూడా అభిమానుల మెప్పును పొందుతూ ఉంటుంది. అందులో భాగంగానే, రొటీన్ సినిమాలు మాత్రమే కాకుండా తనలోని నటిని ఆవిష్కరింపజేసే విధంగా వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ తో మన ముందుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు త్వరలో బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేయబోతుంది సామ్, దాని కోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. అయితే ఇంస్టాగ్రామ్ లో సమంత షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

చేతి నిండా గాయాలతో వున్న ఫోటో పెట్టి, షాట్ సెషన్స్ టైం లో తన హార్డ్ వర్క్ ను అభిమానులతో పంచుకుంది. కేవలం అందంతో మాత్రమే నెట్టుకొచ్చే హీరోయిన్ల మధ్య, నిజానికి సమంత ఇంతింత రిస్కీ ఫిలిమ్స్ చేసే అవసరం లేదు కానీ, ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు, ఆత్మ సంతృప్తికి మించిన పోటీ ఏముంటుంది అనే విధంగా సమంత వర్క్స్ ఉంటాయి. కేవలం సమంత కనిపిస్తే చాలు హౌస్ ఫుల్స్ అయిపోతాయి అనే స్టేజి వరకు సామ్ వచ్చిందంటే, అది జస్ట్ టాలెంట్ ఉంటేనే సాధ్యమయ్యే పని అని, సినీ అభిమానులు సామ్ ను మెచ్చుకుంటున్నారు. దాంతో అభిమానులంతా టెక్ కేర్ సామ్, ప్రౌడ్ అఫ్ యు అంటూ రెప్లైస్ ఇస్తున్నారు.