బాలీవుడ్ (Bollywood) నటి, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త డ్రెస్ సృష్టిస్తూ.. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్ల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ ఉర్ఫీ తాజాగా మ్యాజిక్ డ్రెస్ తో అందరిని మాయ చేసింది. తాజాగా ఉర్ఫీ వేసుకున్న డ్రెస్ పై అందాల తార సమంత (Samantha) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది
ఉర్ఫీ జావెద్ (Urfi Javed) ఎప్పుడూ హాట్ యాంగిల్ లో తన డ్రెస్ స్టైల్ చూపిస్తూ ఉండేది.. కానీ ఈసారి మంత్రం ట్రెండ్ మార్చింది. ఆమె వేసుకున్న డ్రెస్ పై ప్రశసంలు కురిపిస్తున్నారు సెలబ్రటీలు, అభిమానులు. ఈసారి ఉర్ఫీ ఒక బటర్ ఫ్లై డ్రెస్ వేసుకొని అందంగా కనిపించింది. ఈవెంట్ లో పాల్గొన్న ఈ అమ్మడు పసుపు రంగు పువ్వులు, రంగు రంగుల సీతాకోక చిలుకలతో అలరించిన మ్యాజికల్ బ్లాక్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఉర్ఫీ వేసుకున్న మ్యాజికల్ డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆమె వేసుకున్న డ్రెస్ పై సెలబ్రెటీలు, నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు
అందాల భామ సమంత ఉర్పీ వేసుకున్న డ్రెస్ చూసి ముగ్దురాలైనట్టు, బట్టర్ ఫ్లై డ్రెస్ చాలా ఎట్రాక్షన్ ఉందని, బ్యూటిఫుల్ ఉర్ఫీ అంటూ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ డ్రెస్ తన ప్రేమను తెలిపేందుకు హార్ట్ ఎమోజీలను షేర్ చేసింది. మరో బ్యూటీ మృణాల్ స్పందిస్తూ.. సూపర్ డ్రెస్ లవ్ యూ అంటూ కామెంట్స్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ.. ఫైర్ సింబల్స్ షేర్ చేసింది. త్వరలో ఈ అమ్మడు మా ఇంటి బంగారం మూవీతో సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె నటించిన సిటాడెల్ సీరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.