టాలీవుడ్ (Tollywood) లో ఉన్న ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే సమంత (Samantha) కి క్రేజ్ కొంచం ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడో దశాబ్ధంన్నర క్రితం వచ్చిన ఏ మాయ చేసావే నుంచి ఆమె క్రేజ్ అలా చెక్కు చెదరకుండా ఉంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో చేసిన ఖుషి తర్వాత తనకున్నహెల్త్ ప్రాబ్లం వల్ల ఆమె కొత్త సినిమాలేమి ఒప్పుకోలేదు. కానీ ఎక్కడ తన అభిమానులు డల్ అవుతారో అని సోషల్ మీడియా ద్వారా మాత్రం వాళ్ళకి అందుబాటులోనే ఉంటు వస్తుంది. ఇప్పడు లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఒక పిక్ టాక్ అఫ్ ది టాలీవుడ్ అయ్యింది.
మొదటి నుంచి సమంత ఫిట్ నెస్ కి చాలా ప్రాధాన్యతని ఇస్తుంది. ఎంతో కష్టమైన వాటిని చాలా ఇష్టంగా చేస్తు ఆ వీడియోస్ ని ఇనిస్టా లో షేర్ చేస్తుంది. ఆ వర్కౌట్ వీడియోస్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. లేటెస్ట్ గా ఆమె ఒక వీడియో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఆమె కరాటే చెయ్యడానికి సిద్దమయ్యిన దానిలా ఒక కాలుని పైకి ఎత్తింది. దాదాపు తన కంటే హైట్ లో కాలు ఎత్తింది. ఆ పిక్ చూస్తున్న వాళ్లందరైతే చిన్న సైజు బ్రూస్ లీ ల తయారవుతుందేమోనని అంటున్నారు. అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటుందేమో అని అంటున్నారు.
అలాగే మలేషియాలో ఉన్న ప్రకృతి అందాలని కూడా ఆమె షేర్ చేసింది. సమంత ఫ్యాన్స్ (Samantha Fans) అయితే మాత్రం ఆమె షేర్ చేసిన పిక్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. తన హెల్త్ కి సంబందించిన విషయాలని కూడా వెల్లడించింది. ఆమె నుంచి త్వరలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ రానుంది.