సురేఖ నా పేరు వాడొద్దు: సమంతా లేఖ

తెలంగాణాలో మంత్రి కొండా సురేఖ... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లక్ష్యంగా చేసిన ఆరోపణల్లో సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారాన్ని ప్రస్తావించడం పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై తాజాగా సమంతా రియాక్ట్ అయింది.

  • Written By:
  • Publish Date - October 2, 2024 / 09:07 PM IST

తెలంగాణాలో మంత్రి కొండా సురేఖ… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లక్ష్యంగా చేసిన ఆరోపణల్లో సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారాన్ని ప్రస్తావించడం పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై తాజాగా సమంతా రియాక్ట్ అయింది. తన విడాకులు వ్యక్తిగత విషయం అని… దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని కోరుతున్నట్టు ఓ లేఖను విడుదల చేసింది సమంతా. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి, చాలా ధైర్యం, బలం కావాలన్న సమంతా… కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నానని ఆ లేఖలో పేర్కొంది.

దయచేసి చిన్నచూపు చూడకండని విజ్ఞప్తి చేసింది. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నానని, వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా వుండండని కోరింది. నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయన్న సమంతా ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదని స్పష్టం చేసింది. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా అంటూ కోరింది సమంతా. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలానే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ లేఖను ముగించింది.