Samantha Ruth Prabhu: పది ఇబ్బందులతో ఫైట్ చేస్తున్న సమంత..!

సమంత ఇప్పుడు మయో సైటిస్‌తో పోరాడుతోంది. ఇప్పుడు తనకి ఇచ్చిన ఇంజక్షన్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయటానికే కాదు.. మరో పది రకాలుగా తనని కాపాడేందుకని పెట్టిన పోస్ట్ కదిలిస్తోంది. తనకు ప్రజెంట్ ఇస్టున్న చికిత్సలో రోగనిరోదక శక్తిని పెంచటమే కాదు వైట్ బ్లడ్ సెల్స్‌కి బూస్ట్ ఇస్తున్నారట.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 06:41 PM IST

Samantha Ruth Prabhu: సమంత మయోసైటిస్‌తో బాధపడుతోంది. చేతిలో ఉన్న ఆఫర్లను కాదని, ఆల్రెడీ కమిటైన సిటాడెల్ లాంటి వెబ్ సీరీస్‌ల షూటింగ్ పూర్తి చేసి, యూఎస్ వెళ్లింది. ప్రజెంట్ హాస్పిటలైజ్ అయ్యింది. ట్రీట్మెంట్ తీసుకుంటోంది. సెలైన్ ఎక్కుతున్న వేళ సమంత తనకి డాక్టర్స్ ఇస్తున్న మెడిసిన్స్ దేనికోసమో లిస్ట్ పెట్టడంతో, అదిప్పుడు వైరలైంది. యూఎస్‌కి ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి వెళ్లక ముందు కోయంబత్తూర్‌లో మెడిటేషన్ చేసింది. తర్వాత ఫ్రెండ్స్‌తో కలిస బాలిలో సరదాగా గడిపిన సమంత ఇప్పుడు మయో సైటిస్‌తో పోరాడుతోంది.

ఇప్పుడు తనకి ఇచ్చిన ఇంజక్షన్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయటానికే కాదు.. మరో పది రకాలుగా తనని కాపాడేందుకని పెట్టిన పోస్ట్ కదిలిస్తోంది. తనకు ప్రజెంట్ ఇస్టున్న చికిత్సలో రోగనిరోదక శక్తిని పెంచటమే కాదు వైట్ బ్లడ్ సెల్స్‌కి బూస్ట్ ఇస్తున్నారట. హార్ట్ హెల్త్‌తో పాటు మజిల్ హెల్త్ బాగుండేలా, శక్తిని శరీరం గ్రహించేలా, అలానే మిగతా జబ్బులతో శరీరం పోరాడేలా ఇంజక్షన్స్ ఇస్తున్నారట. ఇక ఎముకలు బలంగా అవ్వడంతో పాటు బాడీలో సెల్స్, వాటి సపోర్ట్.. ఇలా మొత్తంగా పదిరకాలుగా తనని కాపాడేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటోంది.

బేసిగ్గా ఓ నార్మల్ పర్సన్‌కి ఈ ఇబ్బందుల నుంచి శరీరమే కాపాడుతుంది. కానీ, రోగనిరోదక శక్తి తాలూకు జబ్బు రావటంతో, తనకి బయటి నుంచి ఇంజక్షన్స్ ద్వారా డాక్టర్స్ కాపాడాల్సి వస్తోందట. మూడునెలలకో సెషన్.. అంటే దాదాపు ఏడాది పాటు నాలుగు సెషన్స్‌గా ఈ చికిత్స తీసుకోవాల్సి ఉంటుందట. కాబట్టి కాలం కలిసొస్తే ఏడాది తర్వాత, లేదంటే రెండేళ్ల తర్వాత సమంత మళ్లీ సెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.