చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అక్కినేని ఫ్యామిలీ, ఫ్యాన్స్… ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొత్త జంట చూడచక్కగా ఉందని.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరోవైపు సమంతకు చైతూ ప్రపోజ్ చేసిన రోజునే.. ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం అభిమానులకు కోపం తెప్పిస్తున్నా.. కొత్త జంట కదా అని అడ్జస్ట్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్‌పై సమంత ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. చైతూతో విడిపోయినప్పటి నుంచి.. సమంత ఎప్పుడూ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నట్లు కనిపించలేదు. చాన్స్ దొరికినప్పుడల్లా.. సోషల్ మీడియా ద్వారా తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూనే ఉంది సామ్. సమంత ఓ పోస్ట్ పెడితే… అది డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో.. చైతూని గుర్తు చేసేలా ఉన్నట్లు అనిపించేది. అనిపించడం కాదు.. ఉండేది కూడా! అలాంటి సమంత ఇప్పుడు చైతూ ఎంగేజ్‌మెంట్ మీద ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. చై, సామ్ విడిపోయిన తర్వాత కనీసం సినిమా వేడుకల్లో కూడా ఎదురుపడలేదు. ఒకరి గురించి ఒకరు నేరుగా మాట్లాడిన సందర్భాలే లేవు. ఎవరి జీవితం వాళ్లదే అన్నట్టు.. ప్రయాణం మొదలుపెట్టారు. సమంత మయోసైటిస్‌తో చికిత్స కోసం ఫారిన్ వెళ్లిపోవడంతో ఆమెను అడిగే చాన్స్ రాలేదు ఎవరికీ.. ఇక చైతూను అప్పుడప్పుడు అడిగినా.. చెప్పీ చెప్పనట్లు ఆన్సర్ చెప్పేసి.. స్కిప్ చేసేవాడు. చైతూ గురించి ఆలోచించడం సమంత ఆపేయలేదు అన్నది మాత్రం క్లియర్. అలాంటిది చైతూ ఇప్పుడు మళ్లీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. దీంతో చైతన్యకు షాక్ ఇచ్చేలా.. సమంత కొత్త ట్విస్ట్ ఇవ్వబోతుందనే ప్రచారం సోషల్‌మీడియాలో జోరుగా సాగుతోంది. నాగచైతన్యపై ప్రొఫెషనల్.. లేదంటే పర్సనల్‌గా చట్టపరమైన యాక్షన్ తీసుకోబోతుందనే విషయం బయటకు వచ్చింది. త్వరలోనే తన టీం ఇందుకు సంబంధించిన ప్రకటన రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. మరి ఇది నిజంగా నిజమా.. గాసిప్‌గానే మిగిలిపోతుందా అంటే.. వెయిట్ చేయాలి మరి..