నాగ చైతన్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత మీడియాలో సమంతా ఏదోక రూపంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బాలీవుడ్ లో ఇప్పుడు వెబ్ సీరీస్ లతో ఈ అమ్మడు బిజీగా మారింది. అక్కడే మంచి సినిమాలు కూడా చేస్తోంది. తెలుగులో కూడా ఓ సినిమాకు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సిడాటేల్ హనీ బన్నీ వెబ్ సీరీస్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉంది సమంతా. మంచి ఆఫర్లు రావడంతో కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. ఇదే టైం లో బాలీవుడ్ హీరోలకు కూడా ఆమె దగ్గరవుతోంది.
ముఖ్యంగా వరుణ్ ధావన్ తో సమంతా ఫ్రెండ్షిప్ చేయడంపై బాలీవుడ్ మీడియా కూడా ఫోకస్ చేస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి సమంతా ర్యాపిడ్ ఫైర్ సెషన్ లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా పలువురు నటుల గురించి కూడా ఆమె కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. వరుణ్, సమంత ‘స్పైసీ’ క్విజ్ లో అడిగిన ప్రశ్నలు… చెప్పిన సమాధానాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరిని అయినా సహ నటులను చెక్ అవుట్ చేసారా అని ధావన్ అడిగాడు.
దీనిపై సమంతా ఆన్సర్ ఇచ్చింది. “అఫ్ కోర్స్, మల్టిపుల్” అని సమాధానం ఇచ్చింది. ఇక తర్వాత వరుణ్ ను కూడా ఇదే ప్రశ్న అడిగింది. ఆ తర్వాత ఫన్ రాపిడ్ ఫైర్ కాస్త ఆసక్తిగా కొనసాగింది, వరుణ్ ధావన్ అడిగిన ఓ ప్రశ్న హాట్ టాపిక్ అయింది. డబ్బును వృధాగా దేనికి ఖర్చు చేశారని అడిగారు. దీనిపై సమంతా సంచలన ఆన్సర్ ఇచ్చింది. తన ఎక్స్ కు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ లు అని సమాధానం చెప్పింది. గిఫ్ట్ ల రేట్ ఎంతో తెలుసుకోవచ్చా అని అడగగా… సమంతా మాత్రం దానికి ఆన్సర్ చెప్పలేదు.
రీటేక్ లు తీసుకుంటావా అని వరుణ్ ధావన్ ను ఆమె ప్రశ్నించింది. “నిజాయితీగా చెప్పాలంటే రీటేక్ లు తీసుకుంటా అని చెప్పుకొచ్చింది. దీనికి సమంతా కచ్చితంగా అబద్దం అంటూ… దీనికి మిర్చీ తినాలి అంటూ కామెడి చేసింది. ఇక గిఫ్ట్ ల గురించి సమంతా చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగ చైతన్యపై సమంతా కోపంగా ఉందని… అతని పెళ్లి కూడా ఆమెకు అసలు నచ్చడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.