Samantha: నొప్పి తట్టుకోలేక ఐస్‌ టబ్‌లో కూర్చున్న సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్​ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్​ కోసం సామ్ చాలా కష్టమైన స్టంట్స్ కూడా చేస్తోంది. రీసెంట్‌గా షూటింగ్‌లో రెండు చేతులకు గాయాలైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటిదే ఓ కొత్త ఫొటోనూ పోస్ట్​ చేసింది సమంత. ‘ఇట్స్‌ టార్చర్ టైమ్’ అంటూ ఐస్‌ టబ్‌లో కూర్చున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది.

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 02:15 PM IST

చాలా కాలం నుంచి సమంత మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ ఫొటో చూడగానే ఇది ట్రీట్‌మెంట్‌లో భాగమని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరే. చాలా టఫ్‌గా ఉండే యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చేసిన తరువాత బాడీ పెయిన్స్‌ ఫాస్ట్‌గా తగ్గేందుకు, టెంపరేచర్‌ కంట్రోల్‌ అయ్యేందుకు ఇలా ఐస్‌టబ్‌లో కూర్చోబెడతారు. వరుస యాక్షన్ సీక్వెన్స్‌లు చేయించడంతో సమంతను కూడా ఐస్‌ టబ్‌లో కూర్చోబెట్టారు సిటాడెల్‌ మూవీ టీం. సమంత మాత్రమే కాదు. ఈ సిరీస్‌లో హీరోగా చేస్తున్న వరుణ్‌ దావణ్ కూడా ఐస్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాడు.

వరుణ్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఐస్‌ టబ్‌ ఫొటోలు షేర్‌ చేశాడు. దీంతో సామ్‌ ఫ్యాన్స్‌ అంతా కాస్త రిలాక్స్‌ అయ్యారు. సిటాడెల్‌ ఇంటర్నేషనల్‌ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా ఫీమేల్‌ లీడ్‌రోల్‌ చేసింది. దీనికి ఇండియన్‌ వెర్షన్‌లో సమంత నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ డైరెక్టర్‌ రాజ్‌, డీకే ఈ వెబ్‌ సిరీస్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో కూడా సమంత ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ చేసింది. ప్రజెంట్‌ సిటాడెల్‌లో కూడా సమంతనే ఫీమేల్‌ లీడ్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్‌ షూటింగ్‌ జరుగుతోంది. ప్రియాంక చోప్రా చేసిన ఇంగ్లీష్‌ వెర్షన్‌ మాత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

సిటాడెల్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు బోల్డ్‌ కంటెంట్‌ కూడా ఎక్కువగా ఉంటుందని ప్రియాంక చోప్రా ఇప్పటికే చెప్పింది. కొన్ని సీన్స్‌లో నటించేందుకు తాను చాలా ఇబ్బంది పడ్డానని కూడా చెప్పింది. అయితే ఇండియన్‌ వెర్షన్‌లో తీస్తున్న సిరీస్‌లో ఆ సీన్స్‌ ఉంటాయా లేదా అనేది క్వశ్చన్‌ మార్క్‌గా మారింది. ప్రస్తుతం యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేస్తున్న తీరు చూస్తే.. బోల్డ్‌ కంటెంట్‌ కూడా అదే స్థాయిలో ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రేంజ్‌లో షూట్‌ చేస్తున్నారంటే సిటాడెల్‌ అవుట్‌పుట్‌, రిజల్ట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.