Samantha: నిజస్వరూపం.. సమంతపై లివర్ డాక్టర్ మండిపాటు

సమంత ఇటీవల యూట్యూబ్‌లో ఆరోగ్యం ఆధారిత పాడ్‌కాస్ట్‌ను విడుదల చేశారు. దానికి ‘టేక్ 20: హెల్త్ పాడ్‌క్యాస్ట్ సిరీస్’ అని పేరు పెట్టారు. పోడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్ 'అండర్‌స్టాండింగ్ ఆటో ఇమ్యూనిటీ' పేరుతో 3 వారాల క్రితం.. అంటే ఫిబ్రవరి 19న విడుదల చేసారు.

  • Written By:
  • Updated On - March 15, 2024 / 10:49 AM IST

Samantha‎: మయోసైటిస్ వచ్చింది.. ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంది.. డివోర్స్ తీసుకుంది.. డిప్రెషన్‌తో కెరీర్ పాడు చేసుకుంది.. ఫ్లాప్స్ వస్తున్నాయి.. ఆఫర్స్‌ దూరమైపోతాయ్ అనుకుంటున్నారా.. అదే దూకుడు.. అదే జోరు అంటున్నారు సమంత. రేసులోకి వస్తే నాతో నిలబడేదెవరు.. నన్ను ఢీ కొట్టేదెవరు అంటూ సవాల్ చేస్తున్న సామ్.. జనాల్ని తప్పుదోవపట్టిస్తుందని విమర్శించారు కొంతమంది నెటిజన్స్.

PAWAN KALYAN: పవన్, మహేశ్ అంటే పాకిస్తానోళ్లకు పిచ్చి..

సమంత ఇటీవల యూట్యూబ్‌లో ఆరోగ్యం ఆధారిత పాడ్‌కాస్ట్‌ను విడుదల చేశారు. దానికి ‘టేక్ 20: హెల్త్ పాడ్‌క్యాస్ట్ సిరీస్’ అని పేరు పెట్టారు. పోడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్ ‘అండర్‌స్టాండింగ్ ఆటో ఇమ్యూనిటీ’ పేరుతో 3 వారాల క్రితం.. అంటే ఫిబ్రవరి 19న విడుదల చేసారు. ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ ‘డిటాక్స్ పాత్‌వేస్’ పేరుతో ఫిబ్రవరి 29న వచ్చింది. ఈ రెండు ఎపిసోడ్‌లలో ఆరోగ్య సమస్యల గురించి వెల్‌నెస్ కోచ్- న్యూట్రిషనిస్ట్ అల్కేష్ షరోత్రితో కలిసి చర్చించారు. ‘డిటాక్స్ పాత్‌వేస్’ మధ్యలో పాడ్‌కాస్టర్లు డాండెలైన్ అనే హెర్బ్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ ఔషధం అని చెప్పారు. దీనిపై ప్రముఖ లివర్ డాక్టర్ తీవ్ర అభ్యంతరం తెలియజేసారు. డాండెలైన్ అనే హెర్బ్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ ఔషధం అని ఆ పాడ్ కాస్ట్‌లో చర్చించడం సరికాదని.. ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఏమాత్రం అవగాహన లేకుండా ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. వెల్నెస్ కోచ్ నిజమైన వైద్యుడు కూడా కాదు. కాలేయం పనితీరు గురించి బహుశా ఆయనకు అసలు తెలియదు” అని డాక్టర్ తన ట్విట్టర్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్స్, కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.