Samantha: ఇన్నాళ్లకు ఓ మంచి నిర్ణయం తీసుకున్న సమంత.. ఈ పని ముందే చేస్తే కాపురం నిలబడేదంటున్న ఫ్యాన్స్‌..

టాలీవుడ్‌ హీరీయిన్స్‌లో విపరీతమై ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్స్‌లో సమంత ఫ్రంట్‌ లైన్‌లో ఉంటుంది. ఇప్పడంటే చాలా మంది ఆమెను నెగటివ్‌గా చూస్తున్నారు కానీ.. ఒకప్పుడు సమంత అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్‌ ఎందరో.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 12:44 PM IST

ప్రియాంక చోప్రా లీడ్‌ రోల్‌లో వచ్చిన సిటాడెల్ రీమేక్‌లో ప్రస్తుతం సమంత నటిస్తోంది. అయితే ఈ సినిమాలో చాలా బోల్డ్‌ సీన్స్‌ ఉంటాయని ప్రియాంక ప్రమోషన్స్‌లో చెప్పింది. యాక్షన్‌ సీన్స్‌ ఎలా ఉంటాయో అంతకంటే ఘాటుగా బోల్డ్‌ సీన్స్‌ కూడా ఉంటాయట. లిప్‌లాక్‌లు, ఎక్స్‌పోజ్‌లు విపరీతంగా ఉంటాయట. ఈ విషయాలన్నీ విన్న సామ్‌ ఫ్యాన్స్‌కు ఓ డౌట్‌ వచ్చింది. సిటాడెల్‌ రీమేక్‌లో ఈ సీన్స్‌ ఉన్నాయా.. ఉంటే సమంత కూడా ఈ సీన్స్‌ చేస్తుందా అని ఇంటర్నెట్‌లో చర్చ పెట్టారు. అలాంటి సీన్స్‌ ఉంటే అందులో నటించొద్దని సామ్‌కు సలహాలు ఇచ్చారు.

ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి చివరికి సమంత టీంకు చేరింది. దీంతో ఈ విషయంపై సమంత టీం క్లారిటీ ఇచ్చింది. ఒరిజినల్‌ సిటాడెల్‌లో ఉన్న చాలా బోల్డ్‌ సీన్స్‌ రీమేక్‌లో తీసేశారట. ఆ సీన్స్‌ తీసేసిన తరువాతే సమంత ప్రాజెక్ట్‌ చేసేందుకు ఒప్పుకుందట. అయితే యాక్షన్‌ సీన్స్‌ మాత్రం ఒరిజినల్‌ సిరీస్‌లో ఎలా ఉన్నాయో రీమేక్‌లో కూడా అలాగే ఉంటాయని చెప్పారు సమంత టీం. బోల్డ్‌ సీన్స్‌, ఎక్స్‌పోజింగ్‌ సీన్స్‌ మాత్రం లేకుండా ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ చేస్తున్నారట.

ఈ న్యూస్‌ చెప్పగానే సామ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. చాలా కాలానికి సమంత ఓ మంచి నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఫ్యామిలీమ్యాన్‌ సిరీస్‌లో ఇలాంటి సీన్స్‌ చేసిన కారణంగానే సామ్‌, చైతన్య మధ్య గ్యాప్‌ వచ్చిందని టాక్‌. ఆ గ్యాప్‌ రోజురోజుకూ పెరిగి విడాకుల వరకూ వెళ్లింది. ఇప్పుడు మళ్లీ అలాంటి సీన్స్‌ చేయడం సామ్‌ కెరీర్‌కు మంచిది కాదంటున్నారు ఫ్యాన్స్‌. సిటాడెల్‌ విషయంలో తీసుకున్న నిర్ణయం ఫ్యామిలీమ్యాన్‌ సిరీస్‌ విషయంలో తీసుకుంటే అసలు చైతన్యతో విడిపోయేది కాదంటు కామెంట్లు పెడుతున్నారు.