Samantha: చాలా కాలం తర్వాత మాయలేడి సమంత మీద మహేశ్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ట్రోలింగ్ పెంచారు. తనకి మయోసైటీస్ వచ్చినా, సినిమాలకు బ్రేక్ చెప్పి రెస్ట్ తీసుకుంటున్నా కూడా వదలట్లేదు. దానికి కూడా సాలిడ్ రీజన్ ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు వన్ నేనొక్కడినే మూవీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, బీచ్‌లో హీరో నడుస్తుంటే, హీరోయిన్ తన పాదాల అచ్చులని చేతులతో తాకుతుంది. ఆ పోస్టర్‌ని చూపించి, ఆడవాళ్లను అవమానించే ఇలాంటి పనులు అంటూ ట్వీట్ చేసింది.
అప్పట్లో ఈ ట్వీట్ పెద్ద దుమారం రేపింది. సింపుల్‌గా కాల్ చేసి అడిగినా క్లారిటీ ఇచ్చేవాళ్లం అని అప్పట్లో దర్శకుడు సుకుమార్ కూడా అన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు సమంత వంతొచ్చింది. ఖుషీలోని పాటలో విజయ్ తన కాలితో సమంత చేతుల్ని, భుజాల్ని తాకటం అనేకంటే తన్నటం చేస్తూ కనిపించాడు. ఈ సీన్ చూసి వెంటనే మరి దీన్నేమంటారు..? ఆడవాళ్లని గౌరవించటమా..? అంటూ మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వన్ నేనొక్కడినే పోస్టర్ మీద సమంత చేసిన పాత కామెంట్‌ని పోస్ట్ చేసి మరీ ట్రోలింగ్ పెంచారు. నిజంగానే మనం ఏం చేస్తే అది తిరిగొస్తుందని, అర్ధం చేసుకోకుండా పిచ్చి కామెంట్స్ పెడితే, కౌంటర్ ఇచ్చే టైం ఎదుటి వాళ్లకు కూడా వస్తుందని ఫ్యాన్స్ ట్రోలింగ్ పెంచేశారు.