Kushi Trailer: కొన్ని జీవితాలు సినిమాలు అవుతాయి. కొన్ని సినిమాలు.. జీవితాల్లా నిజం అనిపిస్తాయి. కన్ఫూజింగ్గా ఉన్నా ఇదే నిజం! ఖుషీ మూవీ ట్రైలర్‌తో ఇప్పుడు అభిమానులు మాట్లాడుకుంటోంది అదే. ప్రేమ, పెళ్లి, గొడవల చుట్టే ఖుషీ మూవీ కథ ఉండబోతుందని ట్రైలర్‌తో అర్థం అయింది. ఖుషీ మూవీ ట్రైలర్ అబ్జర్వ్ చేయాలే కానీ.. సమంత జీవితానికి దగ్గరగా కనిపించడం ఖాయం. నాగచైతన్యతో ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి వరకు జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు.
చైతూతో ప్రేమలో ఉన్న విషయం ఏ మాత్రం బయటకు రాకుండా అప్పట్లో జాగ్రత్త తీసుకుంది సమంత. ఇక ఈ ఇద్దరి పెళ్లికి.. రెండు కుటుంబాల నుంచి వ్యతిరేకత వచ్చిందనే టాక్ నడిచింది. జాతకాల గురించి కూడా చర్చ జరిగిందనే ప్రచారం జరిగింది. ట్రైలర్ అబ్జర్వ్ చేయాలే కానీ.. సమంత, చైతూ జీవితమే గుర్తుకు వస్తుంది. పెళ్లైన తర్వాత సమంత, నాగచైతన్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. పెయిర్ అంటే ఇలా ఉండాలిరా అనిపించే రేంజ్లో పార్టీల్లో, ఫంక్షన్లలో కనిపించారు. అంత క్లోజ్‌గా ఉన్న జంట మధ్య ఒక్కసారిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అది విడాకుల వరకు దారి తీసింది. ఇప్పుడు ఎవరి జీవితం వాళ్లు గడుపుతున్నారు. ఖుషీ మూవీ ట్రైలర్లోనూ ఇలాంటివే కనిపిస్తున్నాయ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో.. పెళ్లే ఒక యుద్ధంగా సాగితే.. ఆ తర్వాత సంసారం మరో యుద్ధంలా నడిచినట్లు ట్రైలర్లో చూపించారు.
ఐతే కొన్ని డైలాగ్స్ మాత్రం చైతూను టార్గెట్ చేస్తున్నట్లు వినిపించాయి అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఇక భర్త అంటే ఎలా ఉంటాడో సమాజానికి చూపిస్తా అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్.. కచ్చితంగా ఆయనను టార్గెట్ చేసిందే అన్నది మరికొందరి వాదన. ఏమైనా ట్రైలర్, సాంగ్స్‌తో ఖుషీ మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.