టాలీవుడ్ (Tollywood) టాప్ హీరోయిన్, చెన్నై సంద్రం సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. విజయదేవరకొండతో చేసిన ఖుషీ సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై పొన్ను.. ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది.. మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీకి సిద్ధమవుతుంది సామ్. ఇటీవలే తన ఇన్ స్టాలో కొన్ని లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్ షేర్ చేస్తూ రీఎంట్రీ పై హింట్ ఇచ్చేసింది. దీంతో సామ్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది.. ఇదే టైమ్‌లో ఈ చెన్నై బ్యూటీ చేసిన ఓ స్పెషల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. చాలా రోజుల తర్వాత ప్రేమ గురించి సమంత స్పెషల్ గా చేసిన ఈ పోస్ట్‌పై అభిమానులు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు..
అక్కడ ఉండే ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమంటూ సమంత స్పెషల్‌గా ఓ పోస్ట్ చేసింది.. కొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ ఆసక్తికర విషయాన్ని రాసుకొచ్చింది.ఇంతకీ విషయం ఏమిటంటే.. రీసెంట్గా సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడే ఉన్న సత్యభామ యూనివర్సిటీలో ఓ ఈవెంట్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సొంతూరిలో దొరికే ప్రేమ ఎప్పుడూ ప్రత్యేక’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.. సమంత నుంచి చాలా రోజుల తర్వాత ప్రేమ అన్న మాట వినబబడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ (Khushi) అవుతున్నారు.. ప్రత్యేకమైన ప్రేమకు నువ్వెప్పుడూ అర్హురాలివే సామ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తమిళ పొన్ను సమంత.. ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే (Naga Chaitanya) ప్రేమించి పెళ్లాడింది.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమ, పెళ్లి, విడాకులు ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మలుపులు తిప్పాయి. తన్యతో ప్రేమ.. పెళ్లి.. నాలుగేళ్లకు విడాకులు తీసుకోవడంతో సామ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగింది.. సమంతపై తీవ్రస్థాయిలో నెగిటివిటీ, విమర్శలు వచ్చాయి. అయినా.. వాటన్నింటిని పట్టించుకోకుండా మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది సామ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవైపు మయోసైటిస్ సమస్య (Myositis problem)తో బాధపడుతూనే శాకుంతలం, యశోధ, ఖుషి చిత్రాల్లో నటించింది.. ప్రస్తుతం మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమైంది..