సోషల్ మీడియాలో సమంత ఎంత యాక్టివ్‌గా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక.. నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ ఏ చిన్న పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం సమంత గ్రీస్ కంట్రీలో ఉంది. ఏథెన్స్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఎప్పటిలాగానే తన మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసింది సామ్.. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంత వరకూ అంతా నార్మల్‌గానే ఉన్నప్పటికీ.. సమంత పెట్టిన ఓ క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీ వృషభరాశిని కోల్పోకండి అంటూ సామ్ పెట్టిన పోస్ట్ నాగ చైతన్యను ఉద్దేశించి పెట్టిందేనా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం మీడియాలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో సామ్ పెట్టిన ఈ క్రిప్టిక్ పోస్ట్ దేనికోసం? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సమంత పెట్టిన ఈ పోస్ట్‌లో ఓ సందేశం ఉంది. సమంతా రాశిచక్రం వృషభరాశి.. దీని అర్థం బలమైన వ్యక్తిత్వం.. స్వయం ప్రేరేపిత ప్రతిభ.. తిరుగులేని ఆత్మ నిబ్బరం కలిగిన వ్యక్తి అని భావించాల్సి ఉంది. శోభిత ధూళిపాళతో నాగ చైతన్య పెళ్లి పుకార్లు ఆన్‌లైన్‌లో వచ్చిన కొద్ది గంటలకే సామ్ ఇలాంటి పోస్ట్ చేయడంపై .. ఆ పోస్ట్ చైని ఉద్దేశించి పెట్టిందే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిజానికి నాగచైతన్యతో విడాకుల తర్వాత వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా సమంత ఎన్కో ఇబ్బందులు ఎదుర్కొంది. మయోసైటిస్ తో ఆరోగ్యాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఎంతో ధైర్యంతో, పట్టుదలతో కంబ్యాక్ అయ్యింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది. హిందీలో సామ్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల సొంత బ్యానర్ ని స్థాపించి ఇందులో బంగారం అనే చిత్రాన్ని మొదటి చిత్రంగా ప్రకటించింది. ఇలాంటి టైమ్‌లో సామ్ పెట్టిన ఈ పోస్ట్ శోభితా దూళిపాళ్ల, చైతన్య పెళ్లి వార్తలపైనే సామ్ రియాక్ట్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.