Spirit : స్పిరిట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్…

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్‌ (Prabhas) తో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) చేయబోయే ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఒక్కటి రివీల్ అయింది.

 

 

 

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్‌ (Prabhas) తో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) చేయబోయే ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఒక్కటి రివీల్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు, ఓపెనింగ్ డే 150 కోట్లు కొడతామని చెప్పి.. అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాడు సందీప్ రెడ్డి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు సందీప్. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘స్పిరిట్‌లో ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్‌కి డ్యూటీలో భాగంగా, తనకి సంబంధించిన దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు.. అనేదే అసలు కథ అని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ 60 శాతం పూర్తి అయ్యిందని.. డిసెంబర్ నాటికీ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి.. షూటింగ్‌కి వెళ్తామని చెప్పాడు. అన్నింటికి మించి సినిమాను నిలబెట్టేది క్యారెక్టర్ పవర్.. స్పిరిట్‌లో ప్రభాస్ గురించి ఆలోచించినప్పుడు.. ఆ క్యారెక్టర్ అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పాడు. ఇక ఈ మూవీకి భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టు చెప్పేశాడు. 300 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నట్లు వెల్లడించాడు.

అంతేకాదు.. ప్రభాస్ క్రేజ్‌కి మొదటిరోజే ఓపెనింగ్సే 150 కోట్లు వచ్చేస్తాయని.. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా చేస్తున్నామని.. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు సందీప్. ఇక ఈ కామెంట్స్‌తో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండడం ఒకటైతే.. సందీప్ రెడ్డి కామెంట్స్‌ నెక్స్ట్ లెవల్ అనేలా ఉన్నాయి. మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.