కెరీర్ లో ఫస్ట్ టైం వివాదం.. 5000 కోట్ల సీన్ ఉన్నా గొడవే…

రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ మాత్రమే కాదు, దర్శక నిర్మాతలకు తోటి నటీ నటులకు డార్లింగ్ కూడా... అంతేకాదు వేరే హీరోల ఫ్యాన్స్ లో కూడా తనని అభిమానించే వాళ్లుండటానికి కారణం తన మనస్థత్వమే...అలాంటి పాన్ ఇండియా కింగ్ కి , వివాదాలకి అసలు లింకే కుదరదు.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 01:05 PM IST

రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ మాత్రమే కాదు, దర్శక నిర్మాతలకు తోటి నటీ నటులకు డార్లింగ్ కూడా… అంతేకాదు వేరే హీరోల ఫ్యాన్స్ లో కూడా తనని అభిమానించే వాళ్లుండటానికి కారణం తన మనస్థత్వమే…అలాంటి పాన్ ఇండియా కింగ్ కి , వివాదాలకి అసలు లింకే కుదరదు. టంగ్ స్లిప్ అయ్యే పరిస్థితే రాదు. అసలు మాట్లాడానికే మొహమాట పడే తను ఇక టంగ్ స్లిప్పయ్యే ఛాన్స్ ఊహించలేం. కాబట్టి కాంట్రవర్సీలకు కూడా అవకాశమే ఉండదు.. కట్ చేస్తే కెరీర్ లో ఫస్ట్ టైం ఎవరూ ఊహించని వివాదంలో కాలుపెట్టాడా? కథ నచ్చిందనో, కమిట్ అయ్యాడు కాబట్టో… మొత్తానికి రెబల్ స్టార్, వివాదానికి తెలియకుండానే వెల్ కమ్ చెబుతున్నాడా? ది రాజా సాబ్ మీద ఎలాంటి వివాదం లేదు. ఫౌజీ కూడా కాంట్రవర్సీ ప్రాజెక్ట్ అని ఎవరూ అనలేదు… లవ్ రూమర్స్ కూడా పెద్దగా రావట్లేదు… మరి అలాంటప్పుడు 5000 కోట్ల కాంట్రవర్సీ అంటే అర్ధమేంటి? అదెలాంటి వివాదం?

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ సెట్లో అయిన గాయం వల్ల ప్రజెంట్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. సంక్రాంతి తర్వాత ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్, ఫౌజీ కొత్త షెడ్యూల్ తో బిజీ అవుతాడు. ఆతర్వాతే స్పిరిట్ మూవీ పట్టాలెక్కుతుంది. మార్చ్ లో ముముర్థం కుదిరింది. అయితే అక్కడే అసలు వివాదానికి రెబల్ స్టార్ వెల్ కమ్ చెబుతున్నాడనంటున్నారు.

వెయ్యికోట్ల వసూల్లని రెండు సార్లు సొంతం చేసుకుని, బాహుబలి 2, కల్కీ తో హిస్టరీ క్రియేట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్. ఆల్రెడీ 5 పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ గా మారిన రెబల్ స్టార్ కి నిజంగా ఎలాంటి పోటీ లేదు. కాబట్టి కాంపిటీషన్ వల్ల వచ్చే ప్రెజర్ లో దారి తప్పుతున్నాడనే అవకాశమే లేదు. కాని వివాదం మాత్రం 1000 నుంచి 5000 కోట్ల రూపంలో ఎదురయ్యేలా ఉంది

ఈ మొత్తం సీన్ కి సందీప్ రెడ్డి వంగనే కారణయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. బేసిగ్గా ఈ డైరెక్టర్ తో ఏ హీరో మూవీకి మూవ్ అయినా, వివాదానికి వెల్ కమ్ చెప్పినట్టే… ఆ కోణంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ కాంట్రవర్సీలో కాలుపెడుతున్నాడా? అంటే ఓసారి సందీప్ జర్నీ ని ఫోకస్ చేస్తే క్లారిటీ వస్తుంది…

సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి.. ఇందులో కోపిష్టి డాక్టర్ గా హీరో కనిపిస్తాడు..తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆ ఫ్రస్ట్రేషన్ ని అంతటా చూపిస్తుంటాడు… తర్వాత యానిమల్ లో కోపిస్టి కొడుగ్గా రణ్ బీర్ కనిపించాడు.. అక్కడ డాక్టర్, ఇక్కడ కొడుకు… పాత్రలు మాత్రమే వేరు… ఇక ప్రేమించిన అమ్మాయికోసం అర్జున్ రెడ్డి, తండ్రిమీద అమితమైన ప్రేమతో యానిమల్… ఇద్దరూ ఎలా ఔట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్లారో అదే సందీప్ సినిమా…

ఒక డాక్టర్ కోపాన్ని, ఒక కొడకు రౌద్రాన్ని చూపించిన సందీప్ రెడ్డి ఈసారి హీరోగా పోలీస్ పాత్రని ఎంచుకున్నాడు. బేసిగ్గా ఖాకీ చొక్కాలోనే ఆవేశం అన్ కంట్రోల్డ్ గా ఉంటుంది. అలాంటి పాత్రలో ఫస్ట్ టైం ప్రభాస్ కనిపిస్తున్నాడు. వెయ్యికోట్ల మూవీని 5 వేల కోట్లుగా మార్చే సత్తా ఉన్న సినిమా అంటున్నారు. అంతవరకు ఓకే కాని, ఇక్కడే వివాదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. ఓ డాక్టర్ ప్రేమ ప్రయాణంలో యాంగర్ మేనేజ్ మెంట్ లేక ఎన్ని తప్పులు చేశాడో, అవన్ని అప్పట్లో ఎంత వివాదంగా మారాయో చూశాం. యానిమల్ మీద అయితే కామెంట్ చేయని బ్యాచ్ లేదు.

కాని ఈ రెండు హిట్లే.. ఎంత హిట్లైనా విమర్శలు, వివాదలు ఆగలేదు. అలాంటిది పోలీస్ పాత్రలో ఈ రేంజ్ ఎమోషన్స్ చూపిస్తే, అవెక్కడ పరిది దాటుతాయో అన్న డౌట్లున్నాయి. అసలే ఏమాత్రం పోలీస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా పాత్ర ఉన్నా, నేషనల్ లెవల్లో కాంట్రావర్సీకి ఛాన్స్ పెరుగుతుంది… అందుకే స్పిరిట్ లో పోలీస్ గా ప్రభాస్ కనిపించటమే కాదు, సందీప్ మేకింగ్ లో సినిమా చేయటమే వివాదానికి వెల్ కమ్ చెప్పడం తో సమానం అంటున్నారు. ఆ వివాదానికి మార్చ్ 5 న సినిమా లాంచ్ తో వెల్ కమ్ చెప్పబోతోంది ఫిల్మ్ టీం.