Sandeep Reddy Vanga: సందీప్‌కి రూ.300 కోట్ల జాక్ పాట్..

ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ప్రభాస్ మూవీ స్పిరిట్ వల్ల సందీప్ ఎకౌంట్‌లోకి 300 కోట్లు రాబోతుండటమే షాకింగ్ న్యూస్. టీ సీరీస్ నిర్మించే ఈ సినిమాకు సందీప్ అన్న ప్రణయ్ కో ప్రొడ్యూసర్‌గా భారీ షేర్ సొంతం చేసుకుంటున్నాడట.

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 06:46 PM IST

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ యానిమల్ హిట్‌తో ఏకంగా రూ.200 కోట్లు వెనకేశాడన్నారు. అది నిజమే. అన్నకు రూ.80 కోట్లు ఇచ్చి తను రూ.120 కోట్లు తీసుకున్నాడు. టీ-సీరీస్ సంస్థతోపాటు సందీప్ రెడ్డి వంగ అన్న ప్రణయ్ కూడా చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. అలా ఈ వెయ్యికోట్ల వేటలో ఉన్న హిట్ మూవీ వసూళ్లలో వాటాగా రూ.200 కోట్లు వచ్చాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ప్రభాస్ మూవీ స్పిరిట్ వల్ల సందీప్ ఎకౌంట్‌లోకి 300 కోట్లు రాబోతుండటమే షాకింగ్ న్యూస్.

Tandel : మార్వలెస్ న్యూస్.. యోధుడిగా చైతూ.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

టీ సీరీస్ నిర్మించే ఈ సినిమాకు సందీప్ అన్న ప్రణయ్ కో ప్రొడ్యూసర్‌గా భారీ షేర్ సొంతం చేసుకుంటున్నాడట. టోటల్ కలెక్షన్స్ మాత్రమే కాకుండా.. ప్రి బరిలీజ్ బిజినెస్ తాలూకు ఎమౌంట్‌లో కూడా భారీ షేర్ దక్కిందట. స్పిరిట్ మూవీ విషయంలో టీసీరీస్‌తో సందీప్, ప్రణయ్ చేసుకున్న డీల్ తాలూకు పేపర్ వర్క్ కూడా పూర్తైంది. ఆ లెక్కన ఈమూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్, అలానే తెలుగ భాష శాటిలైట్, ఓటీటీ రైట్స్‌తోపాటు టోటల్ ప్రాఫిట్స్‌లో 10 శాతం తనకి దక్కబోతున్నాయట. అలా లెక్కేస్తే కనీసం రూ.300 కోట్లు, అదనంగా మరో వందకోట్లు వంగా బ్రదర్స్‌కి దక్కేలా ఉన్నాయి.

కబీర్ సింగ్‌తో వందకోట్లు, యానిమల్‌తో 200 కోట్లు దక్కగా ఇప్పుడు స్పిరిట్‌తో 300 నుంచి 400 కోట్లు సొంతం చేసుకుంటున్నాడు సందీప్. రాజమౌళి, సుకుమార్, ఆట్లీ, శంకర్ కూడా వందకోట్లకు మించి రెమ్యునరేషన్ అందుకోలేదు. కాని సందీప్ మాత్రం వంద, రెండొందలు, మూడొందల కోట్లంటూ ఎక్కడికో వెళ్లిపోతున్నాడు.