ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సందీప్ రెడ్డి ఝలక్

యానిమల్ రిలీజ్‌కి ముందు అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అంతకుముందే స్పిరిట్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 07:20 PM IST

ALLU ARJUN: బన్నీ పుష్ప2 తో ఆగస్ట్ 15న దండెత్తబోతున్నాడు. ఇక ప్రస్తుతం షెడ్యూల్ పూర్తవుతుండటంతో, 15 రోజుల గ్యాప్‌లో వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఫ్యామిలీతో న్యూఇయర్ ట్రిప్ ప్లాన్ చేశాడు. అంతవరకు బానే ఉంది. ఈ హీరోకి సందీప్ రెడ్డి వంగ హ్యాండ్ ఇచ్చాడంటున్నారు. యానిమల్ భారీ సక్సెస్‌లో సందీప్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయని కొందరంటుంటే.. పులి మీద స్వారీ చేస్తున్నాడు సందీప్ అనేస్తున్నారు.

SALAAR: సలార్‌కి పోటీ ఇచ్చే సత్తా.. డంకీ, ఆక్వామ్యాన్ 2కి లేదా..?

అసలు విషయం ఏంటంటే యానిమల్ రిలీజ్‌కి ముందు అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అంతకుముందే స్పిరిట్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో యానిమల్ మూవీ విడుదలయ్యాక ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా పూర్తి చేసి, తర్వాత బన్నీతో సందీప్ సినిమా తీస్తాడనుకున్నారు. ఈలోపు బన్నీ, త్రివిక్రమ్ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ, సీన్ చూస్లే సందీప్ రెడ్డి ప్లాన్స్ మారినట్టున్నాయి. యానిమల్ మూవీ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేంత సీన్ వచ్చేసరికి దీని సీక్వెల్ పట్టాలెక్కించాలి అనుకుంటున్నాడట. ప్రభాస్ స్పిరిట్ అక్టోబర్‌లో మొదలౌతుందని తెలుస్తోంది. దాని తర్వాత యానిమల్ సీక్వెల్.. యానిమల్ పార్క్ ఉంటుందన్నారు.

ఆతర్వాత బన్నీతో మూవీ తీయొచ్చుగా అంటే అక్కడే ట్విస్ట్ ఉంది. స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు తీసేందుకే 3 ఏళ్ల టైం పట్టేలా ఉంది. 2026 వరకు ఈ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యే సందీప్.. ఆ తర్వాత 2027లో అయినా బన్నీమూవీ తీస్తాడా అంటే అదీ లేదట. ఎందుకంటే, యానిమల్ పార్క్‌తో పాటు మూడో సీక్వెల్ యానిమల్ ఇన్ జంగిల్‌ని కూడా ప్లాన్ చేసి వెంటవెంటనే తెరకెక్కిస్తాడట సందీప్. దీంతో బన్నీ ప్రాజెక్ట్ 2028 వరకు పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఆలోపు ఎన్ని లెక్కలుమారుతాయో చెప్పలేం.