రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీని లాంచ్ చేయబోతున్నారు. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతోంది. ఐతే సందీప్ రెడ్డి వంగ నిజానికి స్పిరిట్ చేయటానికి ముందు ఓ హీరో వల్ల మోసపోయాడు. అంటే, డబ్బో లేదంటే మరోకటో కాదు… అంతకంటే విలువైందే సందీప్ రెడ్డి పోగొట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాకుముందు కూడా ఇలానే తనో హీరో వల్ల, చాలా విలువైంది కోల్పోయాడు.. కాని అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ హిట్లతో తన ఫేట్ మారింది. అయినా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్లు పడ్డా, తనని రెండేళ్ల క్రితం ఓ హీరో మోసం చేశాడట… అప్పుడే సీన్ లోకి వచ్చిన రెబల్ స్టార్ సందీప్ కోసం నిలబడ్డాడట… ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపికైన ఈ స్టోరీ ఏంటో చూసేయండి.
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న స్పిరిట్ మూవీ డిసెంబర్ లో లాంచ్, సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్.. అంతవరకు బానే ఉంది. కాని వీళ్ల కాంబినేషన్ నిన్నమొన్న కాకుండా, కబీర్ సింగ్ రిలీజ్ తర్వాతే సెట్ అయ్యిందని ఎంతమందికి తెలుసు.. అవును, యానిమల్ మూవీ పట్టాలెక్కకముందే ప్రభాస్ కి స్పిరిట్ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ.
అయితే ఈమొత్తం ఎపిసోడ్ కి ముందు రెండు సార్లు సందీప్ రెడ్డి వంగ, ఇద్దరు హీరోలతో తన లైఫ్ లో చాలా విలువైనవి ఐదు కోల్పోయాడు.. అవి ఎవరూ తీరిగి తీసుకురాలేదు. ఎవరికీ అంత శక్తిలేదు. అవే ఐదు సంవత్సరాలు..
అర్జున్ రెడ్డి మూవీ తీసేముందు మూడేళ్లు ఓ హీరోకి కథ చెప్పి, ఆప్రాజెక్ట్ మీదే పనిచేశాడట సందీప్. కాని ఆ హీరో మూడేళ్లు మూలకు కూర్చోబెట్టి కథ రాయించి, తర్వాత చేయనన్నాడట.. కట్ చేస్తే తన అన్న తమ పొలాలని అమ్మి అర్జున్ రెడ్డి మూవీకి పెట్టుబడి పెట్టాడు. తర్వాత అదెంత పెద్ద హిట్టైందో చూశాం. దాన్నే కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేస్తే హిట్ కూడారిపీట్ అయ్యింది.
కట్ చేస్తే వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు పడ్డాక కూడా మరో హీరో సందీప్ కి ఆఫర్ ఇచ్చి, రెండేళ్లు కథ మీద కూర్చున్నాక , అంతా ఓకే అనుకునే టైంలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశాడట. దీంతో మహేశ్ బాబుతో అనుకున్న కథని, రణ్ బీర్ కపూర్ తో తీసి యానిమల్ మూవీతో బాలీవుడ్ కి షాక్ ఇచ్చాడు. ఐతే మహేశ్ కి యానిమల్ కథ చెప్పేముందు సందీప్ రెడ్డిని సినిమా చేస్తానని చెప్పి రెండేళ్ళు వేయిట్ చేసి మోసం చేసింది మాత్రం చాలా యంగ్ హీరో..
ఆ టైంలోనే సీన్ లోకి వచ్చిన ప్రభాస్, సందీప్ కి ఆఫర్ ఇచ్చాడట. అలా స్పిరిట్ లైన్ చెప్పి ప్రాజెక్ట్ కన్ఫామ్ చేసుకున్నాకే, ప్రభాస్ ఫ్రీ అయ్యేలోపు యానిమల్ తీశాడు.. హిస్టరీ క్రియేట్ చేశాడు. సో ఒకప్పుడు అల్లు అర్జున్, ఇంకోసారి చరణ్ కూడా సందీప్ కథలు విని నో చెప్పారు కాని, వాళ్లెవరు ఇలా సందీని మూడేళ్లు, రెండేళ్లు వేయిట్ చేయించలేదు..
మోసం చేయలేదు. కాని ప్రభాస్ మాత్రం సరైన టైంలో సందీప్ ని ఆదుకోవటమే కాదు, తను స్పిరిట్ కోసం పూర్తిగా టైం కేటాయిస్తానని 120 రోజుల డేట్లిచ్చాడు.. ఇదంతా యానిమల్ మూవీ తీయటానికి ముందే… ఆ ధైర్యం ఎఫెక్టే యానిమల్ లాంటి ఓ సినిమా వచ్చింది. ఆహిట్ పడ్డాక ప్రభాస్, సందీప్ సినిమా సెట్స్ పైకెళుతోందని తెలుస్తోంది.